Suriya42 title and release date update is here
Suriya42 : తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రస్తుతం తన 42వ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శివ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. మాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న శివ మొదటిసారి ఒక పీరియాడిక్ డ్రామాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ అందరిలో అంచనాలు పెంచేశాయి. రాజుల కాలం, బందిపోటు లాంటి కథాంశంతో ఈ సినిమా కథ ఉండబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది.
Suriya 42 : సూర్య సినిమా హిందీ రైట్స్ 100 కోట్లకు అమ్ముడుపోయాయ?
ఈ మూవీ టైటిల్ అండ్ రిలీజ్ డేట్ ని ఏప్రిల్ 16న ఉదయం 9:05 నిమిషాలకు రెవీల్ చేయనున్నట్లు ప్రకటించారు. తుఫాన్ సృష్టించడానికి వారియర్ వస్తున్నాడు అంటూ కామెంట్ కూడా రాసుకొచ్చారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకం పై జ్ఞానవేల్ రాజా, యువీ క్రియేషన్స్ పతాకం పై వంశీ ప్రమోద్ కలిసి దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ సక్సెస్ పై నిర్మాత జ్ఞానవేల్ రాజా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమా ఈ సినిమాతో బాహుబలి, KGF లాంటి సినిమాలకు తమిళ ఇండస్ట్రీ నుంచి సమాధానం ఇస్తాం అని చెప్పడం బాగా వైరల్ అయ్యింది.
కాగా ఈ సినిమా మొత్తం 10 భాషల్లో రిలీజ్ కానుంది. 3D లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఆల్మోస్ట్ 50 శాతం షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నట్లు నిర్మాత తెలియజేశాడు. ఈ సినిమాతో బాలీవుడ్ భామ దిశా పటాని (Disha Patani) సౌత్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతో తమిళ పరిశ్రమ తమ సత్తా ఏంటో చూపిస్తుందా? లేదా? చూడాలి.
A Mighty Valiant Saga in 10 Languages!!! 3D?
Most Expected #Suriya42 Title + Release Date Announcement on 16th April, Sunday, 9.05 am.
Warrior is coming to storm ?#Suriya42Title @Suriya_offl @DishPatani @directorsiva @StudioGreen2 @UV_Creations @kegvraja @ThisIsDSP pic.twitter.com/uzj07LG1hR
— Studio Green (@StudioGreen2) April 6, 2023