Surya web series fame Mounika Reddy getting married
Mounika Reddy : షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ తెలుగు సినీపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన నటి ‘మౌనిక రెడ్డి’. చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ లో నటించి ఫేమ్ సంపాదించుకోవడంతో.. ఒక ప్రముఖ ఛానల్ ‘అమ్మాయి క్యూట్ అబ్బాయి నాటు’ అనే వెబ్ సిరీస్ ఛాన్స్ ఇచ్చింది. ఇక ఈ సిరీస్ తో పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తరువాత కూడా పలు వెబ్ సిరీస్ లో నటించింది.
Pawan Kalyan: హరీష్ శంకర్ అనౌన్స్‌మెంట్.. వద్దు బాబోయ్ అంటోన్న పవన్ ఫ్యాన్స్!
ఇటీవలే షణ్ముఖ్ జశ్వంత్ తో కలిసి ‘సూర్య’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. సిరీస్ మంచి విజయం అందుకోవడంతో, సినిమా ఆఫర్లు రావడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో పవన్ పక్కన నటించి అందరి దృష్టిని ఆకర్షిచింది. తాజాగా విడుదలైన విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’ సినిమాలో కూడా ఒక పాత్ర చేసింది.
కాగా కెరీర్ మొదలవుతున్న సమయంలో పెళ్లి పీటలు ఎక్కుతున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది ఈ భామ. తన స్నేహితుడు ‘సందీప్ కురపాటి’ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న మౌనిక.. పెళ్లి తేదీని కూడా ప్రకటించింది. డిసెంబర్ 17,18 తేదీల్లో గోవాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. దీంతో ఆమె ఫాలోయర్స్ నుంచి, ఇండస్ట్రీ నుంచి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి.