కార్తికేయ మ్యారేజ్ వీడియో చూసారా?

కార్తికేయ పెళ్ళి వీడియోని పోస్ట్ చేసిన మాజీ మిస్ యూనివర్స్ సుస్మిత సేన్

  • Published By: sekhar ,Published On : January 2, 2019 / 10:02 AM IST
కార్తికేయ మ్యారేజ్ వీడియో చూసారా?

కార్తికేయ పెళ్ళి వీడియోని పోస్ట్ చేసిన మాజీ మిస్ యూనివర్స్ సుస్మిత సేన్

రాజమౌళి తనయుడు కార్తికేయ మ్యారేజ్, జగపతి బాబు సోదరుడు రామ్ ప్రసాద్ కుమార్తె పూజా ప్రసాద్‌తో, డిసెంబర్ 30న పింక్ సిటీ జైపూర్‌లో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ నుండి నాగార్జున, ఎన్టీఆర్, రానా, నాని పెళ్ళికి వెళ్ళారు. అక్కడ దిగిన పిక్స్‌ని, బంగారం సేస్ ఎస్‌ఎస్ అనే హ్యాష్ ట్యాగ్‌తో నాని మిసెస్ అంజనా, చెర్రీ వైఫ్ ఉపాసన, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు.

ఆ ఫోటోలతో పాటు, రాజమౌళి, ప్రభాస్ కలిసి డ్యాన్స్ చేసిన వీడియో, ఎన్టీఆర్, జై బాలయ్యా అని అరిచిన వీడియో కూడా సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుండగా, మాజీ మిస్ యూనివర్స్ సుస్మిత సేన్, కార్తికేయ పెళ్ళి వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. డ్యూరేషన్ ఒక నిమిషం కంటే కాస్త తక్కువ ఉన్న ఈ వీడియోలో, కార్తికేయ, పూజ ఉత్సాహంగా తలంబ్రాలు పోసుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వాచ్ వీడియో…