Susmita Sen and lalith modi breaks their relation susmita sen comments goes viral
Susmita Sen : గత సంవత్సరం ఐపీఎల్(IPL) మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ(Lalit Modi).. సుస్మితా సేన్‌తో డేటింగ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సుస్మితా, లలిత్ కలిసి మాల్దీవుల ట్రిప్ వేసి అక్కడ ఎంజాయ్ చేసిన ఫోటోలని షేర్ చేస్తూ త్వరలో కొత్త జీవితం మొదలుకానుంది అని గత సంవత్సరం ప్రకటించారు ఈ ఇద్దరూ. దీంతో లలిత్ మోదీ, సుస్మితా సేన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని భావించారు అంతా.
అయితే తాజాగా వీరిద్దరూ సంవత్సరం తిరక్కుండానే విడిపోయినట్టు తెలుస్తుంది. త్వరలో సుస్మితా తాళి అనే సిరీస్ తో రాబోతుంది. ఈ సిరీస్ ఆగస్టు 15 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. దీంతో సుస్మితా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా ఈ ప్రమోషన్స్ లో లలిత్ మోదీతో రిలేషన్ షిప్ గురించి మాట్లాడింది.
Suriya : తెలుగు అభిమానులపై సూర్య స్పెషల్ పోస్ట్.. మీరు ఎప్పుడూ బెస్ట్..
సుస్మితా సేన్ మాట్లాడుతూ.. లలిత్ మోదీతో రిలేషన్ గురించి ప్రకటించినప్పుడు అందరూ విమర్శించారు. చాలా విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో నాపై కామెంట్స్ చేశారు. కానీ అవేమి నేను పట్టించుకోలేదు. దేనికి రియాక్ట్ కాలేదు. నా పర్సనల్ లైఫ్ నా ఇష్టం. ఎవ్వరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అయినా ప్రస్తుతానికి నేను సింగిల్ గానే ఉన్నాను అని తెలిపింది. సుస్మితా సింగిల్ గానే ఉందని చెప్పడంతో లలిత్ మోదీతో అప్పుడే బ్రేకప్ చెప్పేసిందా, వీరిద్దరూ సంవత్సరం కాకముందే విడిపోయారా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి మరోసారి దీనిపై సుస్మితా ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.