Hari Hara Veera Mallu: కన్ఫ్యూజన్‌లో పడేసిన వీరమల్లు.. వస్తాడా రాడా..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, ఫిక్షనల్ పీరియాడిక్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, వీడియో గ్లింప్స్ ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, ఫిక్షనల్ పీరియాడిక్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, వీడియో గ్లింప్స్ ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Hari Hara Veera Mallu: పవన్ సినిమా మళ్లీ వాయిదా పడినట్లేనా..?

కాగా, ఈ సినిమా టీజర్‌ను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాత ఏఎం.రత్నం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దీంతో ఈ చిత్ర టీజర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు వారిని నిరాశకు గురిచేసే మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జనవరి 26న హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ఎలాంటి టీజర్ రావడం లేదనే వార్త జోరుగా వినిపిస్తోంది.

Hari Hara Veera Mallu: వీరమల్లు నెక్ట్స్ షెడ్యూల్ ఆ రోజునే స్టార్ట్..?

దీంతో అసలు జనవరి 26న హరిహర వీరమల్లు టీజర్ వస్తుందా.. లేదా.. అనే అయోమయంలో అభిమానులు ఉన్నారు. తమ అభిమాన హీరో నుండి అదిరిపోయే ట్రీట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, పలువురు బాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు