Hari Hara Veera Mallu: పవన్ సినిమా మళ్లీ వాయిదా పడినట్లేనా..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఇఫ్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాతో పవన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో పవన్ ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Hari Hara Veera Mallu: పవన్ సినిమా మళ్లీ వాయిదా పడినట్లేనా..?

Hari Hara Veera Mallu To Postpone Release Date Again

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఇఫ్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాతో పవన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో పవన్ ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Hari Hara Veeramallu: జాక్వెలిన్ కాదు.. పవన్ సినిమాలో ముంబై మనోహరి!

ఇక ఈ సినిమాను దర్శకుడు క్రిష్ అత్యంత ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాలో పవన్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, వీడియో గ్లింప్స్‌లు ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కాగా, తాజాగా ఈ సినిమా షూటింగ్ విషయంలో చిత్ర యూనిట్ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి, అంతే త్వరగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.

Hari Hara Veeramallu: పవన్ హిస్టారికల్ సినిమా.. యాక్షన్ రిహార్సల్స్ వీడియో రిలీజ్!

అయితే ఈ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేసే ఛాన్సులు ప్రస్తుతం కనిపించడం లేదేని తెలుస్తోంది. ఈ సినిమాను ఈయేడాది ప్రథమార్థంలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కానీ, ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్నదానికంటే ఎక్కువ సమయాన్ని తీసుకుంటుండటంతో ఈ సినిమాను ఈయేడు ద్వితీయార్థంలోనే రిలీజ్ చేసేందుకు పవన్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారట. నిర్మాత ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ పీరియాడికల్ ఫిక్షన్ మూవీలో పవన్‌‌తో పాటు అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఎంఎం.కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్ వద్ద రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకుంటుంటా అనేది చూడాలి.