The Birthday Boy : ఆహా ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ..

థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ది బర్త్‌డే బాయ్‌ సినిమా ఇప్పుడు ఆహా ఓటీటీలోకి వచ్చింది.

Suspense Thriller The Birthday Boy Movie Streaming in Aha OTT

The Birthday Boy : వారం వారం కొత్త సినిమాలు, షోలతో తెలుగు ప్రేక్షకులని పలకరిస్తున్న తెలుగు ఓటీటీ ఆహాలోకి ఇప్పుడు మరో కొత్త సినిమా వచ్చింది. ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌ క‌న‌కాల ముఖ్య‌పాత్ర‌ల్లో పలువురు కొత్తవాళ్లతో తెరకెక్కిన ‘ది బర్త్‌డే బాయ్‌’ సినిమా ఐటీవల జులై 19న థియేటర్స్ లోకి వచ్చింది. బొమ్మ బొరుసా బ్యానర్ పై ఐ.భరత్‌ నిర్మాణంలో విస్కీ దాసరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అమెరికాలో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు.

అమెరికాలో పుట్టిన రోజు సెలబ్రేషన్స్ చేసుకునే సమయంలో బర్త్ డే బాయ్ అనుకోకుండా చనిపోతే ఏం జరిగింది, అది మర్డర్ అని తెలిసిన తర్వాత ఏం జరిగింది అనే సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ది బర్త్‌డే బాయ్‌ సినిమా ఇప్పుడు ఆహా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా బిగ్ ఫిష్ సంస్థ ద్వారా ఆహాలో రిలీజయింది. థియేటర్స్ లో మిస్ అయితే ఓటీటీలో కచ్చితంగా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ని చూడండి.

ఇక ది బర్త్‌డే బాయ్‌ సినిమా కథ విషయానికొస్తే.. బాలు(విక్రాంత్), అర్జున్(మణి), వెంకట్(రాజా అశోక్), సాయి(రాహుల్), సత్తి(అరుణ్) అయిదుగురు చిన్నప్పటినుంచి కలిసి పెరిగిన ఫ్రెండ్స్ అమెరికాలో ఒకే ఇంట్లో ఉండి చదువుకుంటూ ఉంటారు. బాలు పుట్టిన రోజు నాడు పీకల దాకా తాగి బర్త్ డే బంప్స్ పేరుతో అతనిపై దాడి చేసి అల్లరి చేస్తుండటంతో ఈ క్రమంలో బాలు చనిపోతాడు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ నలుగురు అమెరికాలో ఉండే అర్జున్ అన్నయ్య భరత్(రవికృష్ణ)కు ఈ విషయం చెప్తారు. అమెరికాలో స్ట్రిక్ట్ రూల్స్, బాడీని ఇండియాకు కూడా తీసుకెళ్ళలేము, తెలిస్తే అందరి జీవితాలు పోతాయి అని ఇండియాలో ఉన్న బాలు పేరెంట్స్ ని అమెరికాకి పిలిపిస్తారు. వాళ్ళుండే ఇంటి రెస్పాన్సిబిలిటీ చూసుకుంటున్న ప్రవీణ్(సమీర్ మళ్ల) ఇది మర్డర్ అని అనుమానిస్తాడు. అసలు బాలు ఎలా చనిపోయాడు? బాలుది హత్య లేకా అనుకోకుండా జరిగిందా? బాలు కథేంటి? ప్రవీణ్, భరత్ కలిసి ఆ నలుగురు ఫ్రెండ్స్ ని కాపాడటానికి ఏం చేసారు తెలియాలంటే సినిమా చూసేయండి.

ట్రెండింగ్ వార్తలు