Vinod Thomas
Vinod Thomas : మళయాళ నటుడు వినోద్ థామస్ కారులో శవమై కనిపించడం కలకలం రేపింది. కారు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ నుండి విషపూరితమైన పొగలు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Nayanthara : నయనతార క్యూట్ బర్త్‌డే సెలెబ్రేషన్స్ చూశారా? ఇంతకంటే ఏం అడగను అంటూ స్పెషల్ పోస్ట్..
ప్రముఖ మళయాళ నటుడు వినోద్ థామస్ (45) కేరలోని కొట్టాయం పంపాడి సమీపంలోని ఓ హోటల్‌లో పార్క్ చేసిన వాహనంలో శవమై కనిపించడం సంచలనం రేపింది. హోటల్ యాజమాన్యం గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించినా వైద్యులు అప్పటికే అతను చనిపోయినట్లు నిర్ధారించారు. అతని మరణానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. వినోద్ థామస్ మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు.
మరోవైపు వినోద్ థామస్ కనిపించిన కారులో ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ నుండి విషపూరితమైన పొగలు వస్తున్నట్లు గుర్తించారు. వాటి కారణంగా అతను చనిపోయి ఉంటాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకు అతని మరణంపై క్లారిటీ లేదు.
Salman Khan : హీరోకి స్టేజిపై అందరిముందు ముద్దులు పెట్టిన సల్మాన్ ఖాన్..
వినోద్ థామస్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ ‘నాతోలి ఒరు చెరియా మీనల్లా’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒరు మురై వంత్ పథాయ, హ్యాపీ వెడ్డింగ్, జూన్ వంటి సినిమాల నటనకు మరింత పేరు వచ్చింది. ప్రస్తుతం ఆయన రేవతి ఎస్.వర్మ డైరెక్షన్‌లో ‘ఈ వాలయం’ సినిమాలో నటిస్తున్నారు. ఈలోపే వినోద్ థామస్ అనుమానాస్పద మృతి మళయాళ చిత్ర పరిశ్రమను విషాదంలో నెట్టేసింది.