Nayanthara : నయనతార క్యూట్ బర్త్‌డే సెలెబ్రేషన్స్ చూశారా? ఇంతకంటే ఏం అడగను అంటూ స్పెషల్ పోస్ట్..
నిన్న నవంబర్ 18 నయనతార పుట్టిన రోజు కావడంతో ఇంట్లోనే తన ఫ్యామిలీతో తన పుట్టిన రోజు వేడుకల్ని సెలబ్రేట్ చేసుకుంది.

Nayanthara Celebrated Her Birthday with Family and Shares a Celebration Video
Nayanthara Birthday Celebrations : లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం సినిమాలు చేస్తూనే ఫ్యామిలీ లైఫ్ ని హ్యాపీగా గడిపేస్తుంది. మనస్సినిక్కరే అనే ఓ మలయాళం సినిమాతో సినీ పరిశ్రమలోకి వచ్చిన నయనతార ఆ తర్వాత తమిళ్, మలయాళం, తెలుగులో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా వరుసగా చేస్తూ లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంది.
కొన్నాళ్లు దర్శకుడు విగ్నేష్ శివన్(Vignesh Shivan) ని ప్రేమించి గత సంవత్సరమే పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఫ్యామిలీకి ఎక్కువ సమయం ఇస్తూ సినిమాలు కూడా చేస్తుంది. సరోగసి ద్వారా కవలపిల్లలకు అమ్మ అయింది. ఇటీవలే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన నయనతార రెగ్యులర్ గా తన ఫ్యామిలీ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది.
నిన్న నవంబర్ 18 నయనతార పుట్టిన రోజు కావడంతో ఇంట్లోనే తన ఫ్యామిలీతో తన పుట్టిన రోజు వేడుకల్ని సెలబ్రేట్ చేసుకుంది. తన భర్త విగ్నేష్, ఇద్దరు పిల్లలు ఉయర్, ఉలగ్ లతో సెలబ్రేట్ చేసుకున్న వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో చాలా క్యూట్ గా ఉంది. విగ్నేష్ నయన్ కి నుదిటిపై ముద్దు పెట్టి శుభాకాంక్షలు తెలిపాడు. ఇద్దరు పిల్లలు చప్పట్లు కొడుతూ సరదాగా ఆడుతున్నారు. ఇక ఈ వీడియో పోస్ట్ చేసి నయనతార.. ఇంతకంటే ఇంకేం అడగను. నాకు దేవుడు ఈ ముగ్గురు అబ్బాయిలని(పిల్లలు, భర్త) ఇచ్చి ఆశీర్వదించాడు అని పోస్ట్ చేసింది.
Also Read : Salman Khan : హీరోకి స్టేజిపై అందరిముందు ముద్దులు పెట్టిన సల్మాన్ ఖాన్..
దీంతో నయన్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఇక విగ్నేష్ కూడా నయన్, పిల్లలతో కలిసి దిగిన ఫోటో షేర్ చేసి బర్త్ డే విషెష్ తెలిపాడు. పలువురు అభిమానులు, నెటిజన్లు, ప్రముఖులు నయనతారకు బర్త్ డే విషెష్ తెలియచేశారు.