Suvarna Textiles: ‘సువర్ణ టెక్స్టైల్స్’ ఫస్ట్ లుక్ రిలీజ్.. సరికొత్త అవతారంలో శివకుమార్
శివకుమార్ రామచంద్రవరపు హీరోగా వస్తున్న 'సువర్ణ టెక్స్టైల్స్(Suvarna Textiles)' మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్.
Suvarna Textiles Movie first look released.
- శివకుమార్ హీరోగా ‘సువర్ణ టెక్స్టైల్స్’
- ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన టీం
- ఆగస్టులో విడుదల
Suvarna Textiles: టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు శివకుమార్ రామచంద్రవరపు ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘సువర్ణ టెక్స్టైల్స్(Suvarna Textiles)’. డిబోరా డోరిస్ ఫెల్, రాజశేఖర్ అనింగి, విక్రమాదిత్య డాంబర్ కీ రోల్స్ చేస్తున్న ఈ సినిమాను ప్రశాంత్ నామిని తెరకెక్కిస్తున్నాడు. సరికొత్త కథాంశంతో వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. లంగా వోణీలో ఉన్న శివకుమార్ బైక్ పై వస్తున్న లుక్ ను విడుదల చేశారు.
వింతగా, కొత్తాగా ఉన్న ఈ పోస్టర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను ఎ.వై.వి.ప్రొడక్షన్స్, సనాతన క్రియేషన్స్ బ్యానర్స్ పై అనిల్ ఈరుగుదిండ్ల నిర్మిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ వెళ్లనున్న ఈ సినిమాను కేవలం రెండు షెడ్యూల్లలో కంప్లీట్ చేసి.. ఆగస్టులో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
