Allu Cinemas: అల్లు అర్జున్ ప్రీమియం మల్టీఫ్లెక్స్.. దేశంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్.. ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా?

అల్లు సినిమాస్(Allu Cinemas) పేరుతో ప్రీమియం మల్టీప్లెక్స్ ను ప్రారంభిస్తున్న అల్లు అర్జున్.

Allu Cinemas: అల్లు అర్జున్ ప్రీమియం మల్టీఫ్లెక్స్.. దేశంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్.. ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా?

Icon Star Allu Arjun opening premium multiplex Allu Cinemas

Updated On : January 2, 2026 / 7:20 PM IST
  • అల్లు అర్జున్ కొత్త వ్యాపారం
  • ‘అల్లు సినిమాస్’ పేరుతో భారీ మల్టీప్లెక్స్‌
  • సంక్రాంతికి ఓపెనింగ్

Allu Cinemas: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ పుష్ప 2 తరువాత నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది. ఈ సినిమా తరువాత ఆయన నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు అట్లీ కుమార్ తో హాలీవుడ్ రేంజ్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా రూ.800 కోట్ల భారీ బడ్జెట్ ను కేటాయించారు.

Riddhi Kumar: రాజాసాబ్ బ్యూటీ రిద్ధి కుమార్.. వైట్ ఫ్రాక్ లో ఎంత క్యూట్ గా ఉందో కదా.. ఫోటోలు

దీంతో, ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీపికా పదుకొనె, మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, అల్లు అర్జున్ కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. ‘అల్లు సినిమాస్(Allu Cinemas)’ పేరుతో భారీ మల్టీప్లెక్స్‌ ఓపెన్ చేయనున్నాడు. హైదరాబాద్‌ కోకాపేట ప్రాంతంలో ఈ థియేటర్ కట్టిస్తున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ అవడం విశేషం.

ఇంకా ఈ థియేటర్ లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. 75 అడుగుల వెడల్పు గల భారీ స్క్రీన్‌, అద్భుతమైన విజువల్స్ కోసం డాల్బీ విజన్ 3D ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌ ఈ థియేటర్ లో సెట్ చేశారు. ఇక ఈ భారీ థియేటర్ ఓపెనింగ్ సంక్రాంతి పండుగ సందర్బంగా జరుగనుందని టాక్ నడుస్తోంది. ఈ థియేటర్ ప్రమోషన్స్ కోసం స్వయంగా అల్లు అర్జున్ రంగంలోకి దిగనున్నాడు. త్వరలోనే థియేటర్ ప్రమోషన్ పనులు కూడా మొదలుకానున్నాయి.