Nikhil Siddhartha : పుట్టబోయే బేబీకి డైపర్స్ ఎలా వెయ్యాలో.. ఇప్పుడే నేర్చుకుంటున్న హీరో నిఖిల్..

నిఖిల్ భార్య పల్లవి అండ్ ఫ్రెండ్స్.. పుట్టబోయే బేబీకి డైపర్స్ ఎలా వెయ్యాలో అనేది నిఖిల్ కి నేర్పించే క్లాస్ తీసుకున్నారు. ఈక్రమంలోనే ఒక జిరాఫీ బొమ్మకి..

Swayambhu hero Nikhil Siddhartha Learning Diaper changing for baby

Nikhil Siddhartha : పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో కెరీర్‌లో ఫుల్ ఫార్మ్‌లో ఉన్న నిఖిల్.. పర్సనల్ లైఫ్ లో కూడా హ్యాపీ మూమెంట్స్ ని చూస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ హీరో తండ్రి కాబోతున్నారు. యాక్టర్ అయిన నిఖిల్ 2020లో పల్లవి అనే డాక్టర్ ని పెళ్లి చేసుకున్నారు. దాదాపు మూడేళ్ళ తరువాత ఈ కపుల్.. తమ మొదటి బేబీకి వెల్కమ్ పలుకుతున్నారు. ఇటీవలే పల్లవి సీమంతం కూడా ఘనంగా జరిగింది.

అందుకు సంబంధించిన ఫోటోని నిఖిల్ షేర్ చేస్తూ.. “సీమంతం అనేది ఇండియన్ ఫార్మ్ ఆఫ్ బేబీ షవర్. త్వరలో మా ఫస్ట్ బేబీ రానుంది అని చెప్పడానికి పల్లవి, నేను చాలా హ్యాపీగా ఉన్నాం. మాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి” అంటూ నిఖిల్ పోస్ట్ వేశారు. అది చూసిన అభిమానులు, నెటిజెన్స్ అందరూ కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ చేశారు. కాగా నిఖిల్ తాజాగా ‘డైపర్ డ్యూటీ’ అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు.

Also read : Kalki 2898 AD : కల్కిలో ‘రాధ’గా మృణాల్ గెస్ట్ రోల్.. నెట్టింట రోజుకో వార్త వైరల్..

నిఖిల్ భార్య పల్లవి అండ్ ఫ్రెండ్స్.. పుట్టబోయే బేబీకి డైపర్స్ ఎలా వెయ్యాలో అనేది నిఖిల్ కి నేర్పించే క్లాస్ తీసుకున్నారు. ఈక్రమంలోనే ఒక జిరాఫీ బొమ్మకి డైపర్ వేయడం ప్రాక్టీస్ చేయించారు. ఇక వారి చెప్పినట్లు నిఖిల్.. ఆ బొమ్మకి డైపర్ వేసి టెస్ట్ పాస్ అయ్యారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోని నిఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులతో పంచుకున్నారు. ఆ వీడియో పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

ఇక నిఖిల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మూడు పాన్ ఇండియా సినిమాలని లైన్లో పెట్టారు. సోషియో ఫాంటసీ ‘స్వయంభు’, పీరియాడిక్ స్పై థ్రిల్లర్ ‘ది ఇండియా హౌస్’, మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కార్తికేయ 3’ చిత్రాలు వరుసలో ఉన్నాయి. ప్రెజెంట్ స్వయంభు షూటింగ్ ని చేస్తున్నారు. ఈ మూవీలో నిఖిల్ వారియర్ గా కనిపించబోతున్నారు. భారత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.