అమ్మాయిలందరికీ ప్రేరణ మంగ్లీ ‘స్వేచ్ఛ’

ఆడపిల్ల గొప్పదనం తెలిపే చిత్రం.. ప్రముఖ గాయని మంగ్లీ టైటిల్‌ రోల్‌ పోషించి ‘స్వేచ్ఛ’ ..

  • Published By: sekhar ,Published On : February 15, 2020 / 01:40 PM IST
అమ్మాయిలందరికీ ప్రేరణ మంగ్లీ ‘స్వేచ్ఛ’

Updated On : February 15, 2020 / 1:40 PM IST

ఆడపిల్ల గొప్పదనం తెలిపే చిత్రం.. ప్రముఖ గాయని మంగ్లీ టైటిల్‌ రోల్‌ పోషించి ‘స్వేచ్ఛ’ ..

ఆడపిల్ల పుడితే చాలు అమ్మో.. అనుకుంటూ అమ్మేస్తున్న సమాజమిది. అలా అమ్మకానికి గురై, అభాగ్యురాలైన ఓ యువతి ఎలా బతికింది? ఆమె ఏం సాధించింది అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘స్వేచ్ఛ’. ప్రముఖ గాయని మంగ్లీ టైటిల్‌ రోల్‌ పోషించింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. కెపీఎన్‌. చౌహాన్‌ దర్శకత్వంలో సరస్వతి డెవలపర్స్‌, లచ్చురాం ప్రొడక్షన్స్‌ పతాకంపై ఆంగోత్‌ రాజునాయక్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

నిర్మాత మాట్లాడుతూ : ‘‘తండా స్థాయి నుండి ప్రపంచస్థాయి వరకు గాయనిగా ఎదిగిన మంగ్లీ ఈ చిత్రంలో అద్భుతమైన పాత్రను పోషించింది. ఆమె పాత్ర నేటి అమ్మాయిలకు ఎంతో ప్రేరణగా నిలుస్తుంది. సెంటిమెంట్‌, వినోదం మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం అందర్ని అరిస్తుందనే నమ్మకం ఉంది. పాపికొండలతో పాటు పలు అందమైన లోకేషన్లలో చిత్రీకరణ జరిపాం’’ అని తెలిపారు. ‘ఒక మంచి పాత్రలో నటించడంతో పాటు సంగీతం అందించడం ఆనందంగా ఉందని’ భోలో షావలి తెలిపారు.

Swecha Movie Releasing on 28th February

దర్శకుడు మాట్లాడుతూ : ‘‘పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంత ముఖ్యమో, ఈ సృష్టికి ఆడపిల్ల అంతే ముఖ్యమని తెలిపే చిత్రమిది. ఆడప్లిలను పురిటిలోనే చంపకుండా వారిని చదివించి, ప్రయోజకులను చేస్తే మగవారికి ఏ రంగంలోనూ వాళ్లు తీసిపోరని చెప్పే అద్భుతమైన కథాంశమిది. మంగ్లీ నటన ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుంది. చమ్మక్‌ చంద్ర ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రలో నటించాడు’’ అని తెలిపారు. ‘బంజారే బంజారే..’ పాటను సింగర్‌ మంగ్లీ అద్భుతంగా ఆలపించారని చెప్పారు.