Sweet Kaaram Coffee : ముగ్గురు మహిళల అందమైన రోడ్ జర్నీనే ఈ వెబ్ సిరీస్.. 240 దేశాల్లో స్ట్రీమింగ్!

మూడు జనరేషన్లకు చెందిన ముగ్గురు మహిళలు చేసిన ఒక అందమైన రోడ్ జర్నీని 'స్వీట్ కారం కాఫీ' అనే టైటిల్ తో ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ సిరీస్‌ని..

Sweet Kaaram Coffee web series is ready to stream in Amazon Prime Video

Sweet Kaaram Coffee : ఓటీటీ కల్చర్ అలవాటు అయ్యిన తరువాత ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా ప్రతి లాంగ్వేజ్ లోని మూవీని చూసేస్తున్నారు. ముఖ్యంగా వెబ్ సిరీస్ కి బాగా అలవాటు పడ్డారు. టెలివిజన్ లో సీరియల్స్ చూసే జనరేషన్ నుంచి ఓటీటీలో వెబ్ సిరీస్ చూసే జనరేషన్ కి ఆడియన్స్ అప్డేట్ అవ్వడంతో మేకర్స్ కూడా అటు వైపుగా అడుగులు వేస్తున్నారు. దీంతో టాలీవుడ్ లో కూడా ఇప్పుడిప్పుడే వెబ్ సిరీస్ కల్చర్ పుంజుకుంటుంది. రెండు గంటల్లో చెప్పలేని కథల్ని వెబ్ సిరీస్ గా మార్చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.

Karthika Deepam : కార్తీకదీపం 2 పై క్లారిటీ ఇచ్చిన డాక్ట‌ర్ బాబు.. ఏం చెప్పాడంటే..?

ఈ క్రమంలోనే ఒక డిఫరెంట్ స్టోరీతో ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video).. ఓ సరికొత్త ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సిరీస్ ని తీసుకు రాబోతుంది. ‘స్వీట్ కారం కాఫీ’ అనే టైటిల్ ని పెట్టుకున్న ఈ సిరీస్ అడ్వెంచరస్ నేపథ్యంతో ఉండబోతుంది. ఈ సిరీస్ లో మూడు జనరేషన్లకు చెందిన ముగ్గురు మహిళలు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. నిన్నే పెళ్లాడతా, మురారి, నాని గ్యాంగ్ లీడర్ సినిమాల్లో కనిపించిన అలనాటి నటి ‘లక్ష‍్మి’.. సీనియర్ జనరేషన్ పాత్రలో కనిపిస్తుంటే రోజా సినిమాతో కురాళ్ళ మనసు దోచుకున్న ‘మధుబాల’.. మిడిల్ జనరేషన్ పాత్రలో కనిపిస్తుంది.

NTR Fan Shyam : అభిమాని మరణం.. ఎన్టీఆర్‌తో పాటు చంద్రబాబు, నిఖిల్ ట్వీట్స్..

వీరిద్దరితో పాటు తమిళ్ నటి ‘శాంతి’.. మరో జనరేషన్ పాత్రలో కనిపించబోతుంది. వీరు ముగ్గురు కలిసి చేసిన ఒక రోడ్ జర్నీ కథే ఈ సిరీస్. మొత్తం 8 ఎపిసోడ్లు. తమిళంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ జులై 6 నుంచి తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. అంతేకాదు ఈ సిరీస్ ని 240 దేశాల ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సిరీస్ కి స్వాతి రఘురామన్, బిజోయ్ నంబియార్, కృష్ణ మరిముత్తు దర్శకులుగా వ్యవహరించారు.

Sweet Kaaram Coffee web series is ready to stream in Amazon Prime Video