సైరా ట్రైలర్ : థియేటర్స్ లిస్ట్

సెప్టెంబర్ 18 సాయంత్రం 05.31 నిమిషాలకు 'సైరా.. నరసింహారెడ్డి' థియేట్రికల్ ట్రైలర్ లాంచ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలెక్టెడ్ థియేటర్స్‌లో భారీ స్థాయిలో ట్రైలర్ స్క్రీనింగ్ కానుంది..

  • Publish Date - September 18, 2019 / 05:21 AM IST

సెప్టెంబర్ 18 సాయంత్రం 05.31 నిమిషాలకు ‘సైరా.. నరసింహారెడ్డి’ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలెక్టెడ్ థియేటర్స్‌లో భారీ స్థాయిలో ట్రైలర్ స్క్రీనింగ్ కానుంది..

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న హిస్టారికల్ అండ్ మోస్ట్ అవైటెడ్ మూవీ.. ‘సైరా.. నరసింహారెడ్డి’ రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఇప్పటివరకు విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ అండ్ మేకింగ్ వీడియోకు మంచి స్పందన వస్తుంది. ముందుగా సెప్టెంబర్ 18న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా చెయ్యాలనుకున్నారు. అదే వేదికపై అభిమానులు, అతిరథుల సమక్షంలో సైరా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చెయ్యాలనుకున్నారు. అయితే వాతావరణం అనూకూలించకపోవడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వాయిదా వేశారు.

కానీ ట్రైలర్‌ మాత్రం ముందుగా చెప్పినట్టుగానే సెప్టెంబర్ 18న విడుదల చెయ్యనున్నారు. సెప్టెంబర్ 18 సాయంత్రం 05.31 నిమిషాలకు సైరా ట్రైలర్ తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ అండ్ మలయాళ భాషల్లో రిలీజ్ చెయ్యనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలెక్టెడ్ థియేటర్స్‌లో భారీ స్థాయిలో ట్రైలర్ స్క్రీనింగ్ కానుంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డ్ రేంజ్‌లో జరిగినట్టు సమాచారం.

శ్రీమతి సురేఖ సమర్పణలో.. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘సైరా’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న భారీగా విడుదల కానుంది. సంగీతం : అమిత్ త్రివేది, కెమెరా : రత్నవేలు, ఎడిటింగ్ : ఎ.శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవన్ నంబియార్, విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ : కమల్ కణ్ణన్.