Syed Abdul Rahim : ఎవరీ సయ్యద్ అబ్దుల్ రహీం.. ఇండియన్ ఫుట్‌బాల్ చరిత్ర మార్చిన హైదరాబాద్ వ్యక్తిపై అజయ్ దేవగణ్ బయోపిక్ ‘మైదాన్’

మైదాన్ సినిమాలో అజయ్ దేవగణ్ ఒకప్పటి భారత్ ఫుట్ బాల్ కోచ్ లా కనిపించనున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ కి మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ బయోపిక్ ఎవరిది? ఈ కోచ్ ఎవరు? ఇండియన్ ఫుట్ బాల్ టీంకి గోల్డెన్ డేస్ ఇచ్చిన కోచ్ ఎవరు అని ప్రేక్షకులు.........................

Syed Abdul Rahim :  బాలీవుడ్(Bollywood) స్టార్ అజయ్ దేవగణ్(Ajay Devgn) వరుసగా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఇటీవల దృశ్యం 2(Drishyam 2) సినిమా రీమేక్ తో బాలీవుడ్ లో మంచి హిట్ కొట్టి ఇప్పుడు భోళా(Bholaa) సినిమాతో వచ్చాడు. శ్రీరామనవమికి(Sri Ramanavami) రిలీజయిన భోళా సినిమా కూడా థియేటర్స్ వద్ద పర్వాలేదనిపిస్తుంది. ఇప్పుడు అజయ్ నెక్స్ట్ మైదాన్(Maidaan) అనే సినిమాతో రాబోతున్నాడు. శ్రీరామనవమి సందర్భంగా మైదాన్ టీజర్ రిలీజ్ చేశారు. 1950 – 60 మధ్య ఇండియా(India) ఫుట్ బాల్(Foot Ball) చరిత్రని మార్చిన ఓ కోచ్ బయోపిక్ ఇది.

మైదాన్ సినిమాలో అజయ్ దేవగణ్ ఒకప్పటి భారత్ ఫుట్ బాల్ కోచ్ లా కనిపించనున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ కి మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ బయోపిక్ ఎవరిది? ఈ కోచ్ ఎవరు? ఇండియన్ ఫుట్ బాల్ టీంకి గోల్డెన్ డేస్ ఇచ్చిన కోచ్ ఎవరు అని ప్రేక్షకులు వెతకడం మొదలుపెట్టారు. అయితే ఈ బయోపిక్ మన హైదరాబాద్ వ్యక్తిది కావడం విశేషం.

హైదరాబాద్ కి చెందిన సయ్యద్ అబ్దుల్ రహీం ఓ స్కూల్ టీచర్, ఆ తర్వాత ఫుట్ బాల్ ఆటగాడిగా, PT గా మారి భారతదేశ ఫుట్ బాల్ టీంకి కోచ్ గా ఎంపికయ్యేంతవరకు ఎదిగాడు. 1909లో హైదరాబాద్ లో జన్మించిన అబ్దుల్ రహీం 1950లో 41 ఏళ్ళ వయసులో ఇండియన్ ఫుట్ బాల్ టీంకి కోచ్ గా ఎంపికయ్యాడు. అతను వచ్చాక ఇండియన్ ఫుట్ బాల్ టీం ఆట మారి పలు విజయాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. అతని కోచింగ్ సారథ్యంలో ఇండియన్ ఫుట్ బాల్ టీం ఆసియన్ గేమ్స్ లో రెండు సార్లు గోల్డ్ కప్ గెలిచింది. 1956లో జరిగిన ఒలంపిక్స్ లో సెమి ఫైనల్ వరకు వెళ్ళింది ఇండియా టీం. ఇప్పటివరకు ఒలింపిక్స్ లో ఇండియా టీంకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇది కోచ్ అబ్దుల్ రహీం ఆధ్వర్యంలోనే సాధించారు. సయ్యద్ అబ్దుల్ రహీం కోచింగ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలు సాధించింది ఇండియా టీం. 1963లో ఇండియన్ ఫుట్ బాల్ టీంకి కోచ్ గా వర్క్ చేస్తున్న సమయంలోనే ఆయన మరణించడంతో మళ్ళీ ఇండియన్ ఫుట్ బాల్ టీం కథ మారిపోయింది.

Sai Pallavi : నేను అందుకే మేకప్ వేసుకోను.. అదే నాకు చాలా కాన్ఫిడెంట్ ఇచ్చింది..

ఇండియన్ ఫుట్ బాల్ కి గోల్డెన్ డేస్ ఇచ్చిన సయ్యద్ అబ్దుల్ రహీం కథని ఇప్పుడు అజయ్ దేవగణ్ మైదాన్ సినిమా రూపంలో తెరకెక్కిస్తున్నాడు. దీంతో ఫుట్ బాల్ ప్రేమికులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ బయోపిక్ తో కూడా అజయ్ హిట్ కొడతాడని ఆశిస్తున్నారు అభిమానులు. ఈ సినిమాని అమిత్ రవీంద్రనాథ్ తెరకెక్కిస్తుండగా బోణి కపూర్ నిర్మిస్తున్నారు. మైదాన్ సినిమా జూన్ జూన్ 23న థియేటర్స్ లోకి రానుంది.

ట్రెండింగ్ వార్తలు