Taapsee Pannu : నా పెళ్లి ఇప్పుడు కాదు ఎప్పుడో అయిపోయింది.. కానీ.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన తాప్సి

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ గా బాగా బిజీగా ఉంది వరుస సినిమాలు చేసింది నాయి తాప్సి.

Taapsee Pannu revealed the shocking truth about her wedding

Taapsee Pannu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ గా బాగా బిజీగా ఉంది వరుస సినిమాలు చేసింది నాయి తాప్సి. పలువురు స్టార్ హీరోల సరసన కూడా నటించి తెలుగులో భారీ గుర్తింపు తెచ్చుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా సినిమాలు చేసింది ఈమె. ప్రస్తుతం తెలుగులో కంటే హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

అయితే అలా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలో డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో ప్రేమలో పడింది. సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాతనే తాప్సికి అతడితో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం ప్రేమగా మారి వాళ్ళు పెళ్లి చుసుకున్నారట. రెండు కుటుంబాల అంగీకారంతో వీరు పెళ్లి చేసుకునట్టు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది తాప్సి.

Also Read : Pushpa 3 : పుష్ప 3లో విలన్ గా విజయ్ దేవరకొండ.. క్లారిటీ ఇచ్చిన రష్మిక మందన్న

కానీ ఇప్పుడు ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది ఈమె.. వీరి పెళ్లి ఈ ఏడాది కాదు ఎప్పుడో జరిగిందని తెలిపింది. గతేడాది డిసెంబర్‌లో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని, ఈ డిసెంబర్‌లో తమ వెడ్డింగ్ యానివర్సరీ కూడా జరుపుకుంటున్నామని చెప్పారు. ఈ విషయాన్ని తాను బయటపెట్టకుంటే ఎవరికి తెలియదని,తమ వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేట్‌గా ఉంచడమే వారికి ఇస్తామని చెప్పింది. పర్సనల్ లైఫ్‌ను పబ్లిక్ చేస్తే వృత్తిపరమైన విషయాలకు అది ఇబ్బంది అవుతుందని.. అందుకే చెప్పలేదని తెలిపింది.