Pushpa 3 : పుష్ప 3లో విలన్ గా విజయ్ దేవరకొండ.. క్లారిటీ ఇచ్చిన రష్మిక మందన్న

పుష్ప 3 ఉందని అనౌన్స్ చేసినప్పటి నుండి ఇందులో విల్లన్ గా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

Pushpa 3 : పుష్ప 3లో విలన్ గా విజయ్ దేవరకొండ.. క్లారిటీ ఇచ్చిన రష్మిక మందన్న

Vijay Deverakonda as villain in Pushpa 3 Rashmika Mandanna gave clarity

Updated On : December 15, 2024 / 10:37 AM IST

Pushpa 3 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా నటించిన లేటెస్ట్ సినిమా పుష్ప 2. డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా విడుదలైన కేవలం 6 రోజుల్లోనే వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో సంచలన విజయంతో దూసుకుపోతుంది.

అయితే పుష్ప 1 బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో దానికి సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కించారు. పుష్ప 2 కూడా ఇప్పుడు సంచలం సృష్టించడంతో దీనికి సీక్వెల్ గా త్వరలోనే పుష్ప 3 కూడా రాబోతుంది. పుష్ప 3 కి సంబందించిన అధికారిక ప్రకటన కూడా చేశారు మేకర్స్. పుష్ప 2 క్లైమాక్ లో పుష్ప 3 టైటిల్ రిలీజ్ చేశారు. పుష్ప 3 ది రాంపేజ్ అని పేర్కొన్నారు.

Also Read : Mohan Babu : మోహన్ బాబు ఎపిసోడ్లో ఊహించని ట్విస్ట్..

అయితే పుష్ప 3 ఉందని అనౌన్స్ చేసినప్పటి నుండి ఇందులో విలన్  గా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కాగా ఈ విషయం పై రష్మిక మందన్న క్లారిటీ ఇచ్చింది. ఇక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” మీకే కాదు నాకు కూడా దీని గురించి తెలియదు. డైరెక్టర్ సుకుమార్ సినిమా విషయంలో చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి విషయంలో సస్పెన్స్ ఉండేలా చూసుకుంటున్నారు. చివరి వరకు చెప్పరు. ‘పుష్ప 2’ సినిమా చాలా విషయాలు కూడా సెట్ లో చెప్పేవారు. సినిమా క్లైమాక్స్‌లో కనిపించిన వ్యక్తిని చూసి.. ‘ఇతనెవరు?’ అని నేను కూడా షాక్ అయ్యా.. అంటూ తెలిపింది రష్మిక మందన్న.