Taapsee Pannu : తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా? ఒలంపిక్ విజేతతో తాప్సీ పెళ్లి..?

తాజాగా తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్టు బాలీవుడ్ సమాచారం.

Taapsee Pannu Secretly Married her Boy Friend Mathias Boe Bollywood Rumours Goes Viral

Taapsee Pannu : హీరోయిన్ తాప్సీ తెలుగు సినిమాలతోనే ప్రయాణం మొదలుపెట్టి అనంతరం బాలీవుడ్ చెక్కేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగానే ఉంది. తాప్సీ గత పదేళ్లుగా డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్‌(Mathias Boe) తో ప్రేమలో ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ తాప్సీ ఎప్పుడూ దీనిపై స్పందించలేదు.

కొన్నాళ్ల క్రితం తాప్సీ పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చినప్పుడు ఆమెని మీడియా అడగ్గా, నా పర్సనల్ విషయాలు బయటకి అనవసరం, ఒకవేళ నిజంగా అయితే నేనే చెప్తాను అని తెలిపింది. తాజాగా తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్టు బాలీవుడ్ సమాచారం. మథియాస్ బోయ్ తొ తాప్సీ వివాహం నిన్న ఉదయ్ పూర్ లోని ఓ హోటల్ లో సింపుల్ గా కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే రెండు రోజుల క్రితమే ఈ పెళ్లి జరిగినట్టు సమాచారం.

Also Read : Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా నుంచి కొత్త సాంగ్ రిలీజ్.. ‘మధురము కదా..’ మెలోడీ సాంగ్ విన్నారా?

మొదట్నుంచి కూడా తాప్సీ తన ప్రేమని సీక్రెట్ గానే ఉంచుతుంది. తాప్సీ కి క్లోజ్ అయిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు కనికా థిల్లాన్, పావైల్ గులాటి, అనురాగ్ కశ్యప్.. పలువురు ఈ పెళ్ళికి హాజరయినట్టు సమాచారం. కనికా, పావైల్ ఓ పెళ్ళికి హాజరైనట్టు ఫోటోలు షేర్ చేసారు కానీ అది ఎవరి పెళ్లి అనేది చెప్పలేదు. బాలీవుడ్ సమాచారం ప్రకారం తాప్సీ పెళ్ళికే వీరంతా వెళ్లినట్టు, మీడియాకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఫోటోలు, వీడియోలు ఏవి బయటకు రాకుండా జాగ్రత్త పడినట్టు తెలుస్తుంది.

అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. తాప్సీ, మథియాస్ బోయ్ పెళ్లి ఫోటోలు లీక్ అయితే తప్ప, లేదా వీళ్ళే ఎవరో ఒకరు అధికారికంగా చెప్తే తప్ప తాప్సీ పెళ్లిపై క్లారిటీ రాదు. మథియాస్ బోయ్ 2012 ఒలంపిక్స్ లో బ్యాడ్మింటన్ లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. ప్రస్తుతం కోచ్ గా పనిచేస్తున్నాడు. ఒలంపిక్ విజేతతో తాప్సీ పెళ్లి అయిందని టాక్ రావడంతో పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.