Taapsee Pannu spending almost one lakh rupees on her dietitian for one month
Taapsee Pannu : టాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు వరుస సినిమాలు చేసి అనంతరం బాలీవుడ్ కి చెక్కేసింది తాప్సి. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయిపొయింది. ఇటీవల లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా చేస్తోంది తాప్సి. తాజాగా బాలీవుడ్ లో తాప్సి ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలు షేర్ చేసుకుంది.
ఈ ఇంటర్వ్యూలో తాప్సి తన డైట్ గురించి మాట్లాడుతూ.. నేను నా డైట్ కి, డైటీషన్ కి ఎక్కువగా ఖర్చుపెడతాను. మా ప్రొఫెషన్ కి ఇది చాలా అవసరం. మేము కచ్చితంగా డైట్ మెయింటైన్ చేయాల్సిందే. నా డైట్ ప్రతి సినిమాకు ఆ సినిమాలోని పాత్రకు తగ్గట్టు మారిపోతుంది. అలాగే నేను ఉండే ప్లేస్, షూటింగ్ ఏరియాని అబట్టి కూడా డైట్ మారిపోతుంది. షూటింగ్ కోసం ఎక్కడికి వెళ్తే అక్కడ దొరికే ఫుడ్ లోనే మా డైట్ కి సంబంధించినవి తీసుకోవాలి. ఇది మా ఫీల్డ్ కి ఎంతో అవసరం. అందుకే నా డైట్ మీద నేను ఎక్కువ ఖర్చు పెడతాను. నా డైటీషన్ కి నెలకు లక్ష రూపాయలు ఇస్తుంటాను అని తెలిపింది.
Kabjaa Movie Review : ఇది కబ్జ కాదు ఉపేంద్ర KGF.. మామూలు రివెంజ్ కథకు KGF కథనం..
దీంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. తాప్సి తన డైటీషన్ కే నెలకు లక్ష ఇస్తుంది అంటే, ఇక తన డైట్ ఫుడ్, మిగిలిన ఖర్చులు ఏ రేంజ్ లో ఉంటాయో అని ఆలోచిస్తున్నారు. అయితే ఇదేమి ఎక్కువ కాదు, స్టార్ హీరోలు, హీరోయిన్స్ మరింత ఎక్కువ పే చేస్తారు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.