Talasani Srinivas Yadav : తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కమిటీ ప్రమాణస్వీకారంలో మంత్రి తలసాని

తెలంగాణ ఫిలిం ఛాబర్ ఆఫ్ కామర్స్ నూతన కమిటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్....

Talasani Srinivas Yadav : తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కమిటీ ప్రమాణస్వీకారంలో మంత్రి తలసాని

Talasani

Updated On : December 3, 2021 / 1:09 PM IST

Talasani Srinivas Yadav :  ఇటీవల తెలంగాణ ఫిలిం ఛాబర్ ఆఫ్ కామర్స్ కు ఎన్నికలు ప్రకటించగా పోటీ లేకుండానే ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకున్నారు. గత చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ఈ సారి కూడా చైర్మన్ గా ఎన్నికయ్యారు. టీఎఫ్‌సీసీ నూతన కార్యవర్గ కమిటీని నవంబర్ 15న ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్‌గా ప్రతాని రామకృష్ణగౌడ్‌, వైస్‌చైర్మన్లుగా గురురాజ్‌, డి.కోటేశ్వరరావు, నెహ్రూ, సెక్రటరీలుగా సాయివెంకట్‌, జె.వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. తాజాగా ఈ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు.

Siddharth : సినిమా హాళ్ళని బతకనివ్వండి అంటూ.. ఏపీ సినిమా టికెట్స్ రేట్లపై స్పందించిన హీరో సిద్దార్థ్..

తెలంగాణ ఫిలిం ఛాబర్ ఆఫ్ కామర్స్ నూతన కమిటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. నూతన కమిటి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. చిత్ర పరిశ్రమ కార్మికుల వెల్ఫెర్ కోసం కళ్యాణలక్ష్మి, కేసిఆర్ కిట్ లాంటి పథకాలను అందిస్తామని అన్నారు. చలనచిత్ర పరిశ్రమకు కులాలు, మతాలు, ప్రాంతాలతో సంబందం లేదు, ప్రస్తుతం మన పరిశ్రమ ఇప్పుడు ఎంతో గొప్ప స్దాయిలో ఉంది, తెలంగాణా ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు ఎంతో తోడ్పాటును అందిస్తుంది, ఇక ముందు కూడా అందిస్తుంది అని అన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్.

Samantha : సోషల్ మీడియాలో మరో రికార్డ్.. అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన సమంత..

సినిమాతో పాటు, టివి రంగానికి, సినిమాలోని అన్ని విభాగాలకు ప్రభుత్వం తరపున సపోర్ట్ ఉంటుందిని, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరం యూనిటిగా ఉండి ముందుకు సాగుదాం అని తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు.