Kamal Haasan
Kamal Haasan : ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయన్ పార్టీ అధినేత కమల్ హాసన్ కరోనాతో నవంబర్ 22న ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. 12 రోజుల చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్న కమల్ శనివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన తెలియచేస్తూ, తాను త్వరగా కోలుకోవాలని మనసారా ఆకాంక్షించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ కు, ఇతర రాజకీయ నాయకులకు, అలానే ప్రముఖ నటుడు రజనీకాంత్ తో పాటు చిత్రసీమకు చెందిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
చదవండి : Kamal Haasan : కమల్ హాసన్‌కు కరోనా..
తనకు వైద్యం అందించిన శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్ వైద్యబృందానికి కమల్ హాసన్ కృతజ్ఞతలు చెప్పారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని.. వెంటనే తన కార్యక్రమాలు మొదలు పెడతానని తెలిపారు.
చదవండి : Kamal Haasan : కోలుకున్న కమల్ హాసన్..