Tamil actor Nassar father had passed away
Nassar : ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. నిన్న టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు తండ్రి మరణించారు. నేడు తమిళ నటుడు నాజర్ ఇంటిలో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి మెహబూబ్ బాషా.. 95 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన.. ఇవాళ తమిళనాడులోని చెంగల్పట్టు నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ సంగతిని నాజర్ ఫ్యామిలీ మెంబెర్స్ మీడియాకి తెలియజేశారు.
Also read : Dil Raju : దిల్ రాజు తండ్రి మరణం.. పరామర్శించిన రామ్ చరణ్..
ఇక పితృవియోగంతో బాధపడుతున్న నాజర్ కు ఇండస్ట్రీ మిత్రులు సానుభూతి తెలుపుతున్నారు. మెహబూబ్ బాషా అంత్యక్రియలు రేపు జరపనున్నారు. ఇండస్ట్రీలోని వ్యక్తుల ఇంటిలో ఇలా రేవుజు వ్యవధిలో విషాద ఛాయలు అలుముకోవడంతో ఇతర సినీ ప్రముఖులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.