Dil Raju : దిల్ రాజు తండ్రి మరణం.. పరామర్శించిన రామ్ చరణ్..

తండ్రి మరణంతో బాధ పడుతున్న దిల్ రాజుని రామ్ చరణ్ కలుసుకొని పరామర్శించాడు.

Dil Raju : దిల్ రాజు తండ్రి మరణం.. పరామర్శించిన రామ్ చరణ్..

Ram Charan condolence to dil raju for his father demise

Updated On : October 10, 2023 / 4:50 PM IST

Dil Raju : టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ఇంట సోమవారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి గత కొన్ని రోజులుగా అనారోగ్యంగా బాధ పడుతున్నారు. నిన్న రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 86 సంవత్సరాలు. ఇక తండ్రి మరణంతో దిల్ రాజు కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నేడు తండ్రి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కాగా ఈ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు దిల్ రాజుకి సానుభూతి తెలియజేస్తున్నారు.

Also read : Babu Mohan : ఈవీవీ లేకుంటే నేను కోలుకునే వాడిని కాదు.. నా ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు..!

కొందరు ప్రముఖులు దిల్ రాజు ఇంటికి చేరుకొని శ్యాంసుందర్ రెడ్డికి నివాళులు అర్పిస్తున్నారు. ఈక్రమంలోనే విలక్షణ నటుడు ప్రకాష్ రాజు.. దిల్ రాజుని కలిసి పరామర్శించారు. అలాగే రామ్ చరణ్ కూడా దిల్ రాజు ఇంటికి చేరుకొని శ్యాంసుందర్ రెడ్డికి నివాళులు అర్పించాడు. దిల్ రాజుతో మాట్లాడి ఆయనకు ధైర్యం చెప్పారు. రామ్ చరణ్, దిల్ రాజు ఇంటి దగ్గర ఉన్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా దిల్ రాజు ముగ్గురు అన్నదమ్ములు. విజయ్ సింహారెడ్డి అనే బ్రదర్.. నిర్మాతగా అందరికి పరిచయం ఉన్న వ్యక్తే. దిల్ రాజుతో పాటు ఈయన ఎక్కువ బయట కనిపిస్తాడు. నరసింహారెడ్డి అనే బ్రదర్ పెద్దగా బయట కనిపించరు.

Ram Charan condolence to dil raju for his father demise Ram Charan condolence to dil raju for his father demise Ram Charan condolence to dil raju for his father demise