Divyabharathi
Divyabharathi : తమిళ్ లో బ్యాచిలర్ సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న దివ్యభారతి రెగ్యులర్ గా మోడ్రన్ డ్రెస్సుల్లో సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తుంది. త్వరలో సుడిగాలి సుధీర్ సరసన గోట్ సినిమాతో దివ్యభారతి తెలుగులోకి రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బట్టల విషయంలో తన తల్లితో జరిగిన ఓ సంఘటన గురించి తెలిపింది.(Divyabharathi)
Also Read : Divyabharathi : బాలయ్యపై తమిళ హీరోయిన్ కామెంట్స్.. ఇప్పటికీ అది ప్రాంక్ అనుకుంటాను..
దివ్యభారతి మాట్లాడుతూ.. నన్ను చిన్నప్పటినుంచి ట్రెడిషినల్ డ్రెస్ లతోనే పెంచారు. కాలేజీ రోజుల్లో కూడా పంజాబీ డ్రెస్, చున్నీతోనే ఉండేదాన్ని. అసలు జీన్స్ కూడా వేయలేదు నేను కాలేజీ అయ్యేదాకా. ఫ్యాషన్ డిజైనింగ్ చేయడానికి చెన్నై వచ్చాను. అప్పటిదాకా ఒక్క మోడ్రన్ డ్రెస్ కూడా వేసుకోలేదు. మా కాలేజీలో మోడలింగ్ చేయమంటే మొదట నేను నో చెప్పాను. కానీ మా మేడం ఒకరు చేయమని చెప్పడంతో ఒక ఫ్యాషన్ షో చేశాను.
ఆ ఫ్యాషన్ షోలో మోడ్రన్ కూడా కాదు కానీ లెహంగా, బ్లౌజ్, పైన చున్నీతోటి చేశా. నడుము పార్ట్ కనిపిస్తుంది. ఆ ఫోటో చూసే మా అమ్మ ఫోన్ చేసి ఏడ్చింది నిన్ను నేను ఇలా పెంచలేదు, ఈ బట్టలేంటి అని తిట్టింది. అంత స్ట్రిక్ట్ మా అమ్మ. అలాంటిది ఇపుడు నేను ఇలా సినిమాలు, డ్రెస్ లు వేసుకోడానికి ఒప్పుకుందంటే మా అమ్మ గ్రేట్ అని చెప్పాలి. ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తుంది అమ్మ. అది నాకు చాలా పెద్ద విషయం. అయినా ఒక్కోసారి నేను సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలకు ఎందుకు ఈ బట్టలతో అని అడుగుతూ ఉంటుంది అని తెలిపింది.