Sattamum Needhiyum : తమిళ్ కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్.. తెలుగులో పెద్ద హిట్.. 13 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి.. ఏ ఓటీటీలో..

తాజాగా హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు.

Sattamum Needhiyum

Sattamum Needhiyum : సీనియర్ తమిళ్ నటుడు శరవణన్ మెయిన్ లీడ్ లో నటించిన తమిళ్ సిరీస్ ‘సట్టముం నీతియుం’. 18 క్రియేటర్స్ బ్యానర్ పై ఈ సిరీస్‌ను శశికళ ప్రభాకరణ్ నిర్మించగా సూర్య ప్రతాప్. ఎస్ షో రన్నర్ గా వ్యవహరించగా బాలాజీ సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఇటీవల జులై లో ఈ సిరీస్ తమిళ్ తో పాటు తెలుగు, హిందీలో కూడా జీ5 ఓటీటీలో రిలీజయింది. అదిరిపోయే కోర్ట్ రూమ్ డ్రామాతో, ఒక మాములు నోటరీలు చేసుకునే లాయర్ ఒక పెద్ద కేసు ఎలా డీల్ చేసాడు అనే కథాంశంతో థ్రిల్లింగ్ గా తెరకెక్కించడంతో ఈ సిరీస్ మంచి సక్సెస్ అయింది.

సట్టముమ్ నీతియుమ్ జీ5 ఓటీటీలో తెలుగులో కూడా మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంది. దీంతో తాజాగా హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. మీరు కూడా ఈ కోర్ట్ రూమ్ డ్రామా మిస్ అయితే జీ5 లో చూసేయండి..

 

Also Read : Nagarjuna : 65 ఏళ్ళ వయసులోనూ మన్మథుడిగా ఉండటానికి ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. చెప్పేసిన నాగ్.. మీరు కూడా ట్రై చేయండి..

సట్టముమ్ నీతియుమ్ తెలుగు సక్సెస్ మీట్ లో నిర్మాత శశికళ మాట్లాడుతూ.. యాంకర్‌గా ఎన్నో సార్లు మైక్ పట్టుకున్నా ఇవాళ నిర్మాతగా కొత్తగా అనిపిస్తోంది. ఇదంతా కూడా నా భర్త ప్రభాకరణ్ వల్లే సాధ్యమైంది. తెలుగులోనూ ఈ సిరీస్ అద్భుతంగా దూసుకుపోతోంది. బాలాజీ గారు ఈ సిరీస్‌ను కేవలం 13 రోజుల్లోనే పూర్తి చేశారు. నా భర్త ప్రభాకరణ్‌కు సిరీస్‌లు, సినిమాల పట్ల ఎంతో ప్యాషన్ ఉంటుంది. ఆయనకు ఈ ప్రాజెక్ట్ చాలా ప్రత్యేకం. ఈ సిరీస్ కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు అని అన్నారు.

డైరెక్టర్ బాలాజీ సెల్వరాజ్ మాట్లాడుతూ.. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నా నిర్మాతలు, జీ5 టీంకు థాంక్స్. నా ఫస్ట్ హీరో శరవణన్ సర్. అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వస్తుండటం ఆనందంగా ఉంది అని అన్నారు. జీ5 బిజినెస్ సౌత్ హెడ్ లాయిడ్ జేవియర్ మాట్లాడుతూ.. సట్టముం నీతియుం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. పది రోజుల్లోనే వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌ను దాటేసింది. 13 రోజుల్లోనే ఇంత మంచి సిరీస్‌ను తెరకెక్కించడం మామూలు విషయం కాదు. పబ్లిక్ డిమాండ్ వల్లే ఈ సిరీస్‌ను ఇతర భాషల్లోకి డబ్ చేశాం అని తెలిపారు.

నటుడు శరవణన్ మాట్లాడుతూ.. తమిళంలో ‘సట్టముం నీతియుం’ సిరీస్ ఎంత హిట్ అయిందో తెలుగులోనూ అంతే రెస్పాన్స్ వస్తోంది. ఇక్కడ కూడా పెద్ద హిట్ చేసింనందుకు థ్యాంక్స్ అని అన్నారు.