TP Gajendran : సినీ పరిశ్రమలో మరో విషాదం.. ఒకప్పటి తమిళ్ స్టార్ డైరెక్టర్ కన్నుమూత..

తమిళ్ సినీ పరిశ్రమలో ఒకప్పటి స్టార్ డైరెక్టర్, నటుడు TP గజేంద్రన్ 68 ఏళ్ళ వయసులో నేడు ఫిబ్రవరి 5 ఉదయం మరణించారు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం........................

tamil famous director and artist TP Gajendran passed away at the age of 68

TP Gajendran : ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత మూడురోజుల్లోనే ముగ్గురు ప్రముఖులు మరణించడం విషాదకరం. కళాతపస్వి K విశ్వనాథ్, ప్రముఖ నిర్మాత గురుపాదం, ప్రముఖ సీనియర్ గాయని వాణి జయరాం మరణ వార్తలని జీరించుకోకముందే మరో విషాదం నెలకొంది.

తమిళ్ సినీ పరిశ్రమలో ఒకప్పటి స్టార్ డైరెక్టర్, నటుడు TP గజేంద్రన్ 68 ఏళ్ళ వయసులో నేడు ఫిబ్రవరి 5 ఉదయం మరణించారు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం కన్నుమూశారు. దీంతో తమిళ సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. పలువురు అయన ఇంటికి వెళ్లి భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా TP గజేంద్రన్ ఇంటికి వచ్చి నివాళులు అర్పించారు.

Bandla Ganesh : బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్‌కి కౌంటర్ ఇచ్చాడా?

సీనియర్ నటుడు ప్రభు హీరోగా అనేక సినిమాలని తెరకెక్కించారు TP గజేంద్రన్. చివరిసారిగా డైరెక్టర్ గా 2010 సినిమా తీసిన TP గజేంద్రన్ ఆ తర్వాత దర్శకత్వం చేయకపోయినా ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించారు. దాదాపు 17 సినిమాలు డైరెక్ట్ చేసిన TP గజేంద్రన్, ఆర్టిస్ట్ గా మాత్రం దాదాపు 100 సినిమాల్లో నటించారు.