×
Ad

SA Chandrasekhar : ‘లియో’ సెకండ్ హాఫ్ బాగోలేదంటే ఫోన్ కట్ చేశాడు.. లోకేష్ కనగరాజ్ పై విజయ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు..

తాజాగా హీరో విజయ్ తండ్రి, ఒకప్పటి డైరెక్టర్ చంద్రశేఖర్ లియో సినిమాపై, లోకేష్ కనగరాజ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Published On : January 28, 2024 / 01:14 PM IST

Tamil Hero Vijay Father SA Chandrasekhar Sensational Comments on Leo Movie and Director Lokesh Kanagaraj

SA Chandrasekhar : తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) విజయ్(Vijay) తో లియో(Leo) అనే సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. అయితే ఈ సినిమాకు మొదట మిక్స్ డ్ టాక్ వచ్చింది. అలాగే తమిళ్ లో తప్ప బయట ఈ సినిమా అంతగా ఆడలేదు. లియో సినిమా అభిమానులకు మాత్రం నచ్చింది. ఇక లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఈ సినిమా ఉండటంతో మొదట్నుంచి అంచనాలు ఉండి కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి.

తాజాగా హీరో విజయ్ తండ్రి, ఒకప్పటి డైరెక్టర్ చంద్రశేఖర్ లియో సినిమాపై, లోకేష్ కనగరాజ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ సినిమా ఈవెంట్ కి హాజరయిన చంద్రశేఖర్ ఈవెంట్లో ఇప్పటి డైరెక్టర్స్ గురించి మాట్లాడుతూ.. విజయ్ దగ్గరికి వచ్చే కథలు ఆయన తండ్రిగా కాకుండా ఒక డైరెక్టర్ గా, అభిమానిగా వింటాను. ఇప్పటి వాళ్ళు హీరో ఉంటే చాలు కథ అవసర్లేదు అనుకుంటున్నారు. ఒకవేళ హీరో వల్ల సినిమా హిట్ అయితే గొప్ప డైరెక్టర్ అని ఫీల్ అవుతున్నారు. ఇటీవల ఓ వారం రోజుల్లో సినిమా రిలీజ్ ఉందనగా ఒక సినిమా చూసాను. నాకు సినిమా ఫస్ట్ హాఫ్ నచ్చింది. సెకండ్ హాఫ్ నచ్చలేదు. సెకండ్ హాఫ్ లో సొంత తండ్రి కొడుకుని చంపాలనుకోవడం, కొన్ని మూఢనమ్మకాల సీన్స్ నచ్చలేదు. డైరెక్టర్ కి కాల్ చేసి ఫస్ట్ హాఫ్ బాగుంది, కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ బాగోలేదు, అవి మారిస్తే బాగుంటుందేమో అని నేను మాట్లాడుతుండగానే సర్ భోజనం చేస్తున్నాను, మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేశాడు. ఇప్పటివరకు మళ్ళీ కాల్ చేయలేదు. విమర్శలు స్వీకరించే ధైర్యం, పరిణితి అతనికి లేవు అని కామెంట్స్ చేశారు.

Also Read : Lavanya Tripathi : వైజాగ్ బీచ్‌లో చెత్త ఏరిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. ‘మిస్ పర్ఫెక్ట్’ ప్రమోషన్స్ మాములుగా లేవుగా..

దీంతో ఈ కామెంట్స్ లియో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కే అని అంతా భావిస్తున్నారు. గతంలోనే సినిమా రిలీజయినప్పుడే లియో సినిమా సెకండ్ హాఫ్ బాగోలేదని, కొంత సాగదీశారని కామెంట్స్ వచ్చాయి. ఇక చంద్రశేఖర్ చెప్పిన సీన్స్ లియోలో ఉన్నవే. అలాగే విజయ్ సినిమాల గురించి ప్రస్తావించి మాట్లాడటంతో ఈ కౌంటర్లు లోకేష్ కే అని అంతా అనుకుంటున్నారు. దీంతో తమిళనాట ప్రస్తుతం విజయ్ తండ్రి చంద్రశేఖర్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.