Lavanya Tripathi : వైజాగ్ బీచ్‌లో చెత్త ఏరిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. ‘మిస్ పర్ఫెక్ట్’ ప్రమోషన్స్ మాములుగా లేవుగా..

పెళ్లి తరువాత కూడా ఇండస్ట్రీలో కొనసాగుతాను అని చెప్పిన లావణ్య త్వరలో ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్ తో రాబోతుంది.

Lavanya Tripathi : వైజాగ్ బీచ్‌లో చెత్త ఏరిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. ‘మిస్ పర్ఫెక్ట్’ ప్రమోషన్స్ మాములుగా లేవుగా..

Lavanya Tripathi Cleaning YMCA Beach in Vizag for Miss Perfect Series Promotions

Updated On : January 28, 2024 / 12:53 PM IST

Lavanya Tripathi : హీరోయిన్ గా ప్రేక్షకులని మెప్పించిన లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) ని ప్రేమించి పెళ్లి చేసుకొని మెగా కోడలు అయిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత లావణ్య మరింత వైరల్ అవుతుంది. మెగా కోడలు కావడంతో లావణ్య మీద ఫోకస్ కూడా ఎక్కువైంది. ఇక పెళ్లి తరువాత కూడా ఇండస్ట్రీలో కొనసాగుతాను అని చెప్పిన లావణ్య త్వరలో ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్ తో రాబోతుంది.

లావణ్య త్రిపాఠి.. ఓవర్ క్లీన్‌నెస్ (OCD) కలిగిన ఓ పాత్ర పోషిస్తూ మెయిన్ లీడ్ లో నటిస్తుండగా అభిజీత్, అభిజ్ఞ, ఝాన్సీ, హర్ష వర్ధన్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆల్రెడీ మిస్ పర్ఫెక్ట్ (Miss Perfect)సిరీస్ నుంచి టీజర్, ట్రైలర్ రిలీజయి మంచి అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ మిస్ పర్ఫెక్ట్ సిరీస్ ప్రముఖ ఓటీటీ డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. దీంతో లావణ్య ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.

Also Read : Kajal Aggarwal : ఫ్యామిలీతో కాజల్ అగర్వాల్ స్విట్జర్లాండ్ వెకేషన్.. ఫొటోలు..

ఈ ప్రమోషన్స్ లో భాగంగా లావణ్య నేడు ఉదయం వైజాగ్(Vizag) లోని YMCA బీచ్ కి వెళ్లి అక్కడి బీచ్ ని క్లీన్ చేసింది. లావణ్య, అభిజ్ఞ, పలువురు సిరీస్ కి చెందిన టీం అంతా కలిసి అక్కడ బీచ్ లో ఉన్న చెత్తని ఏరారు. దీంతో లావణ్య వైజాగ్ బీచ్ లో చెత్త ఏరిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సిరీస్ లో లావణ్య క్లీన్ నెస్ కోరుకునే పాత్ర కావడంతో ఇలా బయట కూడా క్లీనింగ్ చేస్తూ వైరల్ అవుతుంది మెగా కోడలు.