Tamil Movies : తెలుగులోనే కాదు తమిళ్ లో కూడా సంక్రాంతి పోటీ.. ఈ సారి పొంగల్ బరిలో..
పొంగల్ కి మేము కూడా తగ్గేదేలే అంటూ రిలీజ్ లు ప్రకటిస్తున్నారు తమిళ మేకర్స్. (Tamil Movies)
- Saketh U
- Published on- November 1, 2026 / 06:14 PM IST
Tamil Movies
Tamil Movies : సంక్రాంతి అంటే తెలుగు వాళ్లకు పేద పండగనే కాదు సినిమా పండగ కూడా. అందుకే స్టార్ హీరోల నుంచి చిన్న సినిమాల వరకు కుదిరితే సంక్రాంతికి రావాలనుకుంటారు. ప్రతి సంవత్సరం కనీసం నాలుగు సినిమాలు అయినా టాలీవుడ్ లో సంక్రాంతికి రిలీజ్ అవుతాయి. ఈ సారి 2027 సంక్రాంతికి కూడా టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నుంచి మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వరకు దాదాపు అయిదారు సినిమాలు పోటీలో ఉన్నాయి.
అయితే 2027 సంక్రాంతికి టాలీవుడ్‌లోనే కాదు కోలీవుడ్‌లోనూ ఇంట్రస్టింగ్ క్లాష్ జరిగే చాన్స్ కనిపిస్తోంది. పొంగల్ కి మేము కూడా తగ్గేదేలే అంటూ రిలీజ్ లు ప్రకటిస్తున్నారు తమిళ మేకర్స్.
Also Read : Scene Pre Release Event : సూర్య ‘సీన్’ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు? ఎక్కడ? ఫుల్ డీటెయిల్స్..
తమిళ డైరెక్టర్ పా.రంజిత్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా వెట్టువం లేటెస్ట్‌గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఆర్య హీరోగా శోభితా ధూళిపాళ్ల హీరోయిన్‌గా భారీ స్టార్‌కాస్ట్‌తో వస్తోన్న ఈ సినిమా 2027 జనవరి సంక్రాంతికి అని అనౌన్స్ చేసారు మేకర్స్. ఈ సినిమా నుంచి విడుదలైన వరల్డ్ ఆఫ్ వెట్టువం ఇంట్రడక్షన్ వీడియో.. ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేస్తోంది. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అనే 3 వేరేవేరు కాలాల బ్యాక్‌డ్రాప్‌లో వెట్టువం సినిమాని డైరెక్టర్ పా. రంజిత్ తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది.
2027 సంక్రాంతికి కోలీవుడ్ లో రజనీకాంత్ ధర్మన్ సినిమా రిలీజ్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ సినిమాని.. ఫెస్టివల్ టార్గెట్‌గా తీసుకురావాలని చూస్తున్నారు మేకర్స్. నయనతార హీరోయిన్‌గా సిమ్రాన్, రాశీ ఖన్నా, మన హీరో రామ్ కీ రోల్స్ ప్లే చేస్తోన్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే మూడు షెడ్యూల్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు. తమిళ మీడియా సమాచారం ప్రకారం ధర్మన్ సినిమా పక్కాగా 2027 సంక్రాంతికి వస్తుందంటున్నారు. అధికారికంగా ప్రకటించకపోయినా ధర్మాన్ సంక్రాంతికే అని ఫిక్స్ అయిపోయారు.
Also Read : Rishikanth : రామ్ చరణ్ సినిమాలో తమిళ హీరో..? రీసెంట్ ‘డొరొతీ’ సెన్సేషన్.. RC17 పూజ కార్యక్రమంలో రిషికాంత్..
ఇక డైరెక్టర్ మణిరత్నం ఆల్రెడీ తన సినిమా ఇంజి వెల్లమ్ 2027 జనవరి లోనే విడుదలంటూ ప్రకటించేశారు. విజయ్ సేతుపతి, సాయిపల్లవి హీరో హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న ఈ లవ్ జానర్ సినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. AR రెహమాన్ సంగీతం ఇస్తోన్న ఈ సినిమా కల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో సెన్సిబుల్ కథాంశంతో తెరకెక్కుతోంది. చాన్నాళ్ల తర్వాత మణిరత్నం మళ్ళీ లవ్ స్టోరీ తీస్తుండటంతో తెలుగులో కూడా ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా 2027 సంక్రాంతికే థియేటర్స్‌లోకి వస్తున్నట్లు తెలుస్తుంది.
దీంతో తమిళ్ లో పొంగల్ ఫెస్టివల్ కి ఇప్పటికే మూడు సినిమాలు పోరులో ఉన్నాయి. ఏదో ఒక చిన్న సినిమా కూడా వస్తుందని తెలుస్తుంది. ఇక ఈ మూడు సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ అయి రిలీజవుతాయి. దీంతో తెలుగులో అయితే దాదాపు ఏడెనిమిది సినిమాలు సంక్రాంతి రిలీజ్ లో ఉంటాయని తెలుస్తుంది.
