నా ‘మిన్సారా కన్నా’ సినిమా కథను కాపీ కొట్టి ‘పారాసైట్’ తీశారు. కేసు వేస్తా

‘మన్సారా కన్నా’ సినిమా కథను కాపీ కొట్టి ‘పారాసైట్’ తీశారంటున్న తమిళ నిర్మాత థెనప్పన్..

  • Published By: sekhar ,Published On : February 16, 2020 / 11:00 AM IST
నా ‘మిన్సారా కన్నా’ సినిమా కథను కాపీ కొట్టి ‘పారాసైట్’ తీశారు. కేసు వేస్తా

Updated On : February 16, 2020 / 11:00 AM IST

‘మన్సారా కన్నా’ సినిమా కథను కాపీ కొట్టి ‘పారాసైట్’ తీశారంటున్న తమిళ నిర్మాత థెనప్పన్..

‘పారాసైట్’.. ఈ ఏడాది ఆస్కార్ బరిలో ఏకంగా నాలుగు అవార్డ్స్ గెల్చుకుని సెన్సేషన్ క్రియేట్ చేసిన సౌత్ కొరియన్ మూవీ. బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలింతో పాటు ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగాల్లో అకాడెమీ అవార్డునందుకుని యావత్ సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అయితే ఈ సినిమా ఓ తమిళ సినిమాకే కాపీ అంటూ మీడియాలో, సోషల్ మీడియాలో గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ వార్త చదివి.. కొడితే గిడితే మనోళ్లు కొరియన్ సినిమాలు కాపీ కొట్టాలి కానీ.. వాళ్లు మన సినిమాని కాపీ కొట్టడమేంటి కామెడీగా.. అనుకుని నవ్వుకున్నారు అంతా. కట్ చేస్తే.. తన సినిమాను కాపీ కొట్టారంటూ తమిళ నిర్మాత తెరపైకి వచ్చేసరికి విషయం కొత్త టర్న్ తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాట దళపతి విజయ్, రంభ జంటగా స్టార్ డైరెక్టర్ కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో 1999లో ‘మిన్సార కన్నా’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కథ, ‘పారాసైట్’ కథ ఒకటే అని తమిళ నిర్మాత థెనప్పన్ ఆరోపిస్తున్నారు.

 

త్వరలో ‘పారాసైట్’ నిర్మాతలపై ఇంట‌ర్నేష‌న‌ల్ లాయ‌ర్ సాయంతో కేసు ఫైల్ చేయ‌బోతున్న‌ట్టు చెప్పారు. వారి సినిమాల‌ని ఇన్సిపిరేష‌న్‌గా తీసుకొని ప్రాజెక్టులు చేస్తుంటే మా మీద కేసులు పెడుతున్నారు. ఇప్పుడు మేం కూడా అదే చేయ‌బోతున్నాం.. అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారాయన. కొసమెరుపుగా.. నా కథ’కు ఇంటర్నేషనల్ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. ‘‘మిన్సారా కన్నాను ఇన్‌స్పిరేషన్‌గా తీసిన ‘పారాసైట్’ కు ఆస్కార్ రావడం సంతోషంగా ఉంది. అయితే, దాని పై దావా వేయడమన్నది నిర్మాతకు సంబంధించింది.. అని థెనెప్పన్ అన్నారు. 

కథ విషయానికొస్తే..
బాన్గ్ జూన్ హో దర్శకత్వం వహించిన ‘పారాసైట్’ సినిమా కథలో ఒక పేద కుటుంబానికి చెందిన వారంతా మెల్లమెల్లగా ఒక ధనవంతుని ఇంటికి చేరుతారు. ఆ ధనవంతుల కుటుంబ సభ్యులకు  వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలియదు. 1999లో విజయ్ హీరోగా వచ్చిన తమిళ సినిమా ‘మిన్సారా కన్నా‘లో మోనికా కాస్టెలినో, రంభ, ఖుష్బూ సుందర్ కీలక పాత్రల్లో నటించారు. సినిమాలో కన్నన్(విజయ్).. ఐశ్వర్య(మోనికా కాస్టెలినో)ను ప్రేమిస్తాడు. ఐశ్వర్య పెద్ద సోదరి ఇందిరా దేవి (ఖష్బూ) తన చెల్లెలిని కంటికి రెప్పలా చూసుకుంటుంటుంది. కన్నన్ మారువేషంలో ఐశ్వర్య ఇంటిలో బాడీగార్డుగా చేరుతాడు.

తరువాత కన్నన్ తమ్ముడు వెట్రీ అన్నయ్య పనిచేస్తున్న ఇంటిలోనే పనివాడిగా, చెల్లెలు వంట మనిషిగా చేరతారు. అయితే ఇందిరా దేవికి తన ఇంటిలో పనిచేస్తున్న ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారని తెలియదు. ఈ కథ ఆధారంగా విజయ్ ఫ్యాన్స్ ‘పారాసైట్’ సినిమా ‘మిన్సారా కన్నా‘ సినిమాకు కాపీ అని ఆరోపిస్తున్నారు.

 

కాగా ఈ  రెండు సినిమాల కథ పైకి ఒకే తీరులో కనిపించినా ‘మిన్సారా కన్నా’సినిమాలో ఒక పేదవాడు ధనవంతురాలిని ప్రేమిస్తాడు. తరువాత వారు ఒకటవుతారు. అదే ‘పారాసైట్‘ సినిమా విషయాని కొస్తే ఇది కూడా ఒక ధనవంతుల కుటుంబం, ఒక పేద కుటుంబం మధ్య నడిచే కథే తప్ప.. కొరియన్ మూవీకీ, తమిళ్ మూవీకీ చాలా తేడా ఉందంటున్నారు సినీ పండితులు. 

Minsara Kanna