Tamil Sankranti Movies : సంక్రాంతి తెలుగు సినిమాలు ఓకే.. తమిళ సినిమాల పరిస్థితి ఏంటి.. ధనుష్ వర్సెస్ శివ కార్తికేయన్..

ఈసారి తమిళ్ లో ధనుష్ కెప్టెన్ మిల్లర్(Captain Miller), శివ కార్తికేయన్ అయలాన్(Ayalaan), అరుణ్ విజయ్ మిషన్ చాప్టర్ 1 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి.

Tamil Sankranti Movies Captain Miller Ayalaan Mission Chapter 1 Collections Full Details Here

Tamil Sankranti Movies : ఈ సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు రిలీజయిన సంగతి తెలిసిందే. నాలుగు సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నాయి. కలెక్షన్స్ కూడా అదరగొడుతున్నాయి. గుంటూరు కారం సినిమా ఇప్పటికే 170 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి దూసుకెళ్తుంది. హనుమాన్ సినిమా 100 కోట్ల గ్రాస్ దాటి అదరగొడుతుంది. నా సామిరంగ సినిమా కూడా 25 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. సైంధవ్ సినిమా అధికారికంగా ప్రకటించకపోయినా 20 కోట్ల వరకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.

అయితే తమిళ సినిమాలు కూడా ఇటీవల ఎక్కువగా తెలుగులో డబ్ అయి రిలీజవుతున్నాయి. కానీ ఈ సారి నాలుగు తెలుగు సినిమాలు ఉండటంతో తమిళ్ సంక్రాంతి సినిమాలు తెలుగు రిలీజ్ ఆపుకున్నాయి. ఈసారి తమిళ్ లో ధనుష్ కెప్టెన్ మిల్లర్(Captain Miller), శివ కార్తికేయన్ అయలాన్(Ayalaan), అరుణ్ విజయ్ మిషన్ చాప్టర్ 1 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి.

Also Read : Sandeep Vanga : భీమవరంలో సందీప్ వంగ కార్‌ని ఆపేసిన ప్రభాస్‌ ఫ్యాన్స్.. ‘స్పిరిట్’ సినిమా గురించి..

కెప్టెన్ మిల్లర్ సినిమా ఇప్పటికే 60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక అయలాన్ సినిమా 50 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. మిషన్ చాప్టర్ అధికారికంగా ప్రకటించకపోయినా 10 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్టు సమాచారం. అయితే అయలాన్, కెప్టెన్ మిల్లర్ త్వరలోనే తెలుగులో కూడా రిలీజయి ఇక్కడ కూడా మంచి కలెక్షన్స్ సాధిస్తాయని భావిస్తున్నారు.