Mayil Samy : పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి..

ఓ పక్కన తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పిస్తుండగానే నేడు ఉదయం తమిళ పరిశ్రమ ప్రముఖ స్టార్ కమెడియన్ మయిల్ సామి కన్నుమూశారు. ఇవాళ ఉదయం అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబసభ్యులు హాస్పిటల్ కు తరలిస్తుండగానే..................

tamil star comedian mayil sami passes away at the age of 57

Mayil Samy :  ఇటీవల గత కొంత కాలంగా సినీ పరిశ్రమలో వరుస మరణాలు చోటు చేసుకుంటూ విషాదాన్ని నింపుతున్నాయి. శనివారం రాత్రి నటుడు తారకరత్న మరణించడంతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్నకు నివాళులు అర్పిస్తున్నారు. ఓ పక్కన తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పిస్తుండగానే నేడు ఉదయం తమిళ పరిశ్రమ ప్రముఖ స్టార్ కమెడియన్ మయిల్ సామి కన్నుమూశారు.

1984 లో నటుడిగా కెరీర్ మొదలుపెట్టిన మయిల్ సామి తక్కువ సమయంలోనే చాలా సినిమాలు చేసి మంచి కమెడియన్ గా ఎదిగాడు. అనంతరం స్టార్ హీరోల సినిమాల్లో సైతం కమెడియన్ గా నటిస్తూ కోలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు మయిల్ సామి. తమిళ్ లోని ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కమెడియన్ గా నటించాడు. తన కెరీర్ లో దాదాపు 300 సినిమాల్లో నటించాడు. అంతే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కుండా కొన్ని డబ్బింగ్ సినిమాల్లో కమెడియన్స్ కి వాయిస్ ఇచ్చాడు. తెలుగు నుంచి తమిళ్ కి డబ్బింగ్ అయిన పలు సినిమాల్లో మన బ్రహ్మానందం, అలీకి కూడా మయిల్ సామి వాయిస్ ఇచ్చారు.

Tarakaratna-Balakrishna : బాలయ్య బాబాయ్ తో నటించాలనే కోరిక తీరకుండానే కన్నుమూసిన తారకరత్న

ఇప్పటికి కూడా పలు సినిమాల్లో మయిల్ సామి కమెడియన్ గా నటిస్తున్నాడు. ఇవాళ ఉదయం అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబసభ్యులు హాస్పిటల్ కు తరలిస్తుండగానే మరణించారు. 57 ఏళ్ళ వయసులో మయిల్ సామి కన్నుమూయడం బాధాకరం. మయిల్ సామి మృతిపై పలువురు తమిళనాడు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియచేస్తున్నారు. పలువురు తమిళ సినీ, రాజకీయ ప్రముఖులు మయిల్ సామి ఇంటికి వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కూడా మయిల్ సామి మరణంపై ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంతాపం ప్రకటించారు.