Tamil star Madhavan to play Hanuman in Varanasi movie
Varanasi: దర్శధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ సినిమా “వారణాసి”(Varanasi). సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న ఈ ఇంటర్నేషనల్ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇంతకాలం కేవలం రీజనల్ సినిమాలను ఇంటర్నేషనల్ లెవల్లో ప్రమోట్ చేసిన రాజమౌళి ఇప్పుడు వారణాసి సినిమాతో ఏకంగా ఇంటర్నేషనల్ సినిమాను చేస్తున్నాడు. ఇందుకోసం తెలుగు ఇతిహాసాలైనా రామాయణాన్ని ప్రేరణగా తీసుకున్నాడు. మన సినిమాను, మన కల్చర్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లనున్నాడు. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ఇంట్రో వీడియోలో ఏ రేంజ్ లో క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు రాముడిగా కనిపిస్తాడు అని రాజమౌళి ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే, రామాయణ కథలో రాముడు ఉన్నదంటే పక్కన హనుమతుల వారి దర్శనం తప్పనిసరి కదా. అందుకే, ఇప్పుడు వారణాసి సినిమాలో హనుమంతుడిగా ఎవరు చేస్తున్నారు అనేదానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే, తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు. వారణాసి సినిమాలో హనుమతుడిగా తమిళ స్టార్ మాధవన్ చేస్తున్నాడట.
దీనికి సంబంధించి ఇప్పటికే ఆయనతో కథ, పాత్ర చర్చలు కూడా జరిగాయని టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ పాత్రకు సంబంధించి టెస్ట్ లుక్ కూడా ట్రై చేయనున్నారట మేకర్స్. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే, హనుమంతుడి పాత్ర కోసం తెలుగులో నటులు ఎవరు లేరా. ఎందుకు ఆ పాత్ర అనగానే బయట నటులను తెస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నాడు నెటిజన్స్. గతంలో ప్రభాస్ చేసిన ఆదిపురుష్ సినిమాలో కూడా హనుమంతుడి పాత్ర కోసం బాలీవుడ్ యాక్టర్ ను తీసుకువచ్చారు. మరి ఆ పాత్రలో మాధవన్ ఏమేరకు మెప్పిస్తాడు అనేది చూడాలి.