Suriya : బాలయ్య షోలో ఆ విషయంలో ఎమోషనల్ అయిన సూర్య.. తెలుగు వాళ్ళే ఎక్కువ స్పాన్సర్ చేస్తున్నారు..

తాజాగా రిలీజ్ చేసిన అన్‌స్టాపబుల్ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఈ షోలో సూర్య ఎమోషనల్ అయి కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు.

Tamil Star Suriya got Emotional in Balakrishna Unstoppable Show

Suriya : ఆహా ఓటీటీలో బాలయ్య అన్‌స్టాపబుల్ షో సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా సాగుతున్న సంగతి తెలిసిందే. మొదటి ఎపిసోడ్ కి సీఎం చంద్రబాబు రాగా సెకండ్ ఎపిసోడ్ కి దుల్కర్ తో పాటు లక్కీ భాస్కర్ సినిమా టీమ్ వచ్చారు. తాజాగా మూడో ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ కి సూర్యతో పాటు కంగువ టీమ్ తరపున బాబీ డియోల్, డైరెక్టర్ శివ వచ్చారు.

తాజాగా రిలీజ్ చేసిన అన్‌స్టాపబుల్ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఈ షోలో సూర్య ఎమోషనల్ అయి కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. సూర్య, అతని కుటుంబం అగరం ఫౌండేషన్ తరపున ఎంతోమంది పేద విద్యార్థులను చదివిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రస్తావన రాగా ఓ పేద విద్యార్ధి ఎమోషనల్ వీడియో కూడా ప్లే చేసారు.

Also Read : Lucky Baskhar : బాక్సాఫీస్ వ‌ద్ద దుల్కర్ స‌ల్మాన్ మూవీ దూకుడు.. ఐదు రోజుల్లో ‘ల‌క్కీ భాస్క‌ర్’ ఎంత క‌లెక్ట్ చేసిందో తెలుసా?

దీంతో సూర్య ఎమోషనల్ అయి.. నా లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళ వల్లే ఇది నేను చేయగలుగుతున్నాను. చాలా మంది స్పాన్సర్స్ చేస్తున్నారు. తమిళ్ వాళ్ళు స్పాన్సర్స్ చేస్తున్నారు. కానీ పేద పిల్లల చదువుల కోసం స్పాన్సర్ చేసేవాళ్ళల్లో చాలా మంది తెలుగు కమ్యూనిటీ వాళ్ళే ఉన్నారు. వాళ్ళ సహకారంతోనే నేను ఈ పని చేయగలుగుతున్నాను అని తెలిపారు.

సూర్య, అతని కుటుంబం కలిసి ప్రతి సంవత్సరం ఎంతోమంది పేద విద్యార్థులను చదివిస్తున్నారు. ఈ విషయంలో అతన్ని అంతా అభినందిస్తారు. తాజాగా అలాంటి విద్యార్థులు కోసం సూర్య పడే తపన, అతను ఎమోషనల్ అవ్వడం చూసి సూర్యని మరింత అభినందిస్తున్నారు. మీరు కూడా ప్రోమో చూసేయండి..