Tamil Star Vijay Sethupathi said ok to Puri Jagannadh Story
Puri Jagannadh : ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్. కానీ గత కొంతకాలంగా ఫ్లాప్స్ వెంటాడుతున్నాయి. స్టార్ హీరోలు సైతం పూరితో సినిమా చేయడానికి ఎదురుచూసేవాళ్ళు. కానీ ఇప్పుడు చిన్న హీరోలు కూడా పూరిని వద్దంటున్నారు. ఒక హీరోని మాస్ హీరో చేయాలన్నా, స్టార్ హీరో చేయాలన్నా పూరి జగన్నాధ్ తర్వాతే ఎవరైనా. అలాంటిది ఇప్పుడు పడిపోయిన తన స్టార్ డమ్ ని నిలబెట్టుకోవడానికి పూరి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.
లైగర్, డబల్ ఇస్మార్ట్ తర్వాత పూరి జగన్నాధ్ తెలుగులో పలువురు హీరోలకు కథలు చూపినా ఓకే చెప్పలేదట. చిరంజీవితో, నాగార్జునతో, విజయ్ దేవరకొండ, గోపీచంద్ తో సినిమాలు చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ అవేవి వర్కౌట్ అవ్వలేదు. ఇక తెలుగులో పని అవ్వదని అనుకున్నాడేమో పూరి తమిళ్ వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు.
Also Read : Vijayashanthi : అప్పటివరకు నాన్ వెజ్ తినను అని మొక్కుకున్న విజయశాంతి.. ఎందుకంటే..
తాజా సమాచారం ప్రకారం పూరి జగన్నాధ్ తమిళ్ స్టార్ విజయ్ సేతుపతికి కథ చెప్పాడట. విజయ్ కూడా సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేసాడని, పూరి ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేయగానే విజయ్ డేట్స్ ఇస్తాడని తమిళ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఓ ఆసక్తికర కథని విజయ్ సేతుపతితో పూరి తీయనున్నాడట.
ఇటీవల మహారాజాతో భారీ హిట్ కొట్టిన విజయ్ సేతుపతి హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. విజయ్ సేతుపతి సినిమా అంటే మంచి కంటెంట్ అని అందరికి నమ్మకం ఉంది. దీంతో విజయ్ సేతుపతి పూరి కథ ఓకే చేసాడంటే పూరి మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడని భావిస్తున్నారు. చూడాలి మరి విజయ్ సేతుపతి – పూరి సినిమా అధికారికంగా ఓకే అయిందా, వీళ్ళ కాంబోలో సినిమా వస్తుందా చూడాలి.