Taraka Ratna daughter nishka shares tarakaratna last video
Taraka Ratna : నందమూరి తారకరత్న (Taraka Ratna) ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం నందమూరి కుటుంబాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఇక తారకరత్న కుటుంబ సభ్యులు అయితే ఆ బాధ నుంచి బయటకి రాలేకపోతున్నారు. ఈ క్రమంలోనే తారకరత్న భార్య (Alekhya reddy), కూతురు నిష్కా.. సోషల్ మీడియాలో తారకరత్న గురించి వరుస పోస్ట్ లు వేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నిష్కా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తారకరత్నకు సంబంధించిన చివరి వీడియోని షేర్ చేసింది.
Tarakaratna : సొంత వాళ్ళే నీ మనసు బాధ పెట్టారు.. తారకరత్న భార్య సంచలన పోస్ట్!
ఆ వీడియో తారకరత్న, నిష్కాతో కలిసి గేమింగ్ సెంటర్ లో గేమ్ ఆడుతూ కనిపిస్తున్నాడు. తారకరత్న చనిపోయే ముందురోజు సాయంత్రం తనతో కలిసి గేమ్ ఆడాడు అంటూ ఈ వీడియోని నిష్కా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఇటీవల అలేఖ్య రెడ్డి తన ఇన్‌స్టాలో.. సొంత వాళ్ళే తారకరత్న మనసు బాధపెట్టారు అంటూ సంచలమైన పోస్ట్ పెట్టింది. తారకరత్న ఎప్పుడు పెద్ద కుటుంబాన్ని కోరుకునేవాడు. కానీ తన ఆవేదనని కుటుంబంలోని ఎవరు అర్ధం చేసుకోలేదు.
Tarakaratna : అలేఖ్య రెడ్డి వరుస పోస్ట్‌లు.. తారకరత్నతో చివరి ఫోటో!
ఆఖరికి నేను కూడా తనని ఆ బాధ నుంచి బయటికి తీసుకు రాలేకపోయాను. సొంత వాళ్ళే తన మనసు బాధ పెట్టారు. మొదటి నుంచి మాతో ఎవరు ఉన్నారో, చివరిలో కూడా వాళ్ళే మిగిలారు. మేము ఎవర్ని అయితే కోల్పోయామో, వాళ్ళు తన చివరి చూపుకు కూడా రాలేదు అంటూ చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇది ఇలా ఉంటే, బాలకృష్ణ హిందూపూర్ లో తాను కట్టే హోపిటల్ లోని ఒక బ్లాక్ కి తారకరత్న పేరు పెట్టాడు. అంతేకాదు అక్కడ పెద్దవాళ్ళకి ఉచితంగా గుండె సంబంధిత సమస్యలకు చికిత్స అందించనున్నాడు.