Tarakaratna : తారకరత్న చేతి పై ఉన్న పచ్చబొట్టు ఏ హీరో సంతకమో తెలుసా?

నందమూరి హీరో తారకరత్న గత కొన్ని రోజులుగా మృత్యువుతో పోరాడుతూ వచ్చి ఈ శనివారం (ఫిబ్రవరి 19) రాత్రి కన్నుమూశారు. కాగా తారకరత్న చేతి పై ఒక పచ్చబొట్టు ఉంటుంది. ఆ టాటూలో ఒక సింహం బొమ్మ ఉండగా, దాని కింద ఒక సంతకం కూడా ఉంటుంది. ఆ సంతకం ఒక హీరోది.

taraka ratna tattoo

Tarakaratna : నందమూరి హీరో తారకరత్న గత నెలలో హార్ట్ ఎటాక్ గురై హాస్పిటల్ లో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. టీడీపీ లీడర్ నారా లోకేష్ ప్రారంభించిన పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న నడుస్తూ నడుస్తూ కుప్పకూలి పోయాడు. వెంటనే కుప్పం హాస్పిటల్ కి తరలించగా, ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లకి తీసుకు వెళ్లారు. గత 22 రోజులుగా చికిత్స అందిస్తున్న తారకరత్న ఆరోగ్యంలో ఎటువంటి పురోగతి కనిపించలేదు. ఇన్నిరోజులు మృత్యువుతో పోరాడిన తారకరత్న ఈ శనివారం (ఫిబ్రవరి 19) రాత్రి కన్నుమూశారు.

Tarakaratna : తారకరత్న మరణాన్ని దాచిపెట్టారు.. లక్ష్మీ పార్వతి!

ఇక విషయానికి వస్తే.. తారకరత్న చేతి పై ఒక పచ్చబొట్టు ఉంటుంది. ఆ టాటూలో ఒక సింహం బొమ్మ ఉండగా, దాని కింద ఒక సంతకం కూడా ఉంటుంది. ఆ సంతకం ఒక హీరోది. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ సంతకం ఎవరిది అని ఆలోచిస్తున్నారా? తారకరత్నకి బాలకృష్ణ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలకృష్ణకి కూడా తారకరత్న అంటే అంతే ఇష్టం. తారకరత్న హాస్పిటల్ లో అడ్మిట్ అయినప్పటి నుంచి అంతా దగ్గర ఉండి కంటికి రెప్పల్లె చూసుకున్నాడు బాలయ్య.

ఇంతటి అనుబంధాన్నికి గుర్తుగా తారకరత్న, బాలయ్య ఆటోగ్రాఫ్ ని తన చేతి పై పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. ఇప్పుడు తారకరత్న అకాల మరణంతో కుమిలిపోతున్న అతని భార్య, పిల్లల బాధ్యతని తానే తీసుకుంటున్నట్లు బాలకృష్ణ కుటుంబసబ్యులకు మాటిచ్చినట్లు విజయ్ సాయిరెడ్డి తెలియజేశాడు. కాగా రేపు ఉదయం గం.9:03 నిమిషాలకు తారకరత్న భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ కు తరలించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వరకు అభిమానుల సందర్శనర్థం కోసం తారకరత్న పార్థివ దేహాన్ని అక్కడే ఉంచనున్నారు. అనంతరం అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగనున్నాయి.