Tarakaratna wife Alekhya reddy emotional post
Tarakaratna : నటుడు మరియు రాజకీయ వేత్త తారకరత్న ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. జనవరి నెలలో టీడీపీ లీడర్ నారా లోకేష్ మొదలుపెట్టిన పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న.. నడుస్తూ నడుస్తూ హార్ట్ ఎటాక్ వచ్చి కుప్పకూలి పోయాడు. ఇక ఆయన్ని చికిత్స కోసం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తరలించారు. దాదాపు 23 రోజులు పాటు వెంటిలేటర్ పై మృత్యువుతో పోరాడిన తారకరత్న.. ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం ఇటు సినీ ప్రముఖులను అటు రాజకీయ నాయకులను దిగ్బ్రాంతికి గురి చేసింది.
Tarakaratna : వైరల్ అవుతున్న తారకరత్న పెదకర్మ పత్రిక.. ఆహ్వానితులుగా బాలయ్య, విజయసాయిరెడ్డి పేర్లు
ఇక నందమూరి కుటుంబం అయితే వరుస మరణాలతో శోక సంద్రంలో మునిగి తేలుతుంది. తారకరత్న భార్య పిల్లలు ఆయన లేరు అన్న నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో వరుస పోస్ట్ లు చేస్తూ ఆమె భాదని తెలియజేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ వేసింది. తారకరత్నతో కలిసి దిగిన చివరి ఫోటోను షేర్ చేస్తూ.. ”ఇదే మన చివరి ఫోటో, చివరి ప్రయాణం అని నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. ఇదంతా ఒక కల అయితే బాగుండు. ఆ కల నుంచి నువ్వు నన్ను ‘అమ్మ బంగారం’ అని లేపితే బాగుండు” అంటూ రాసుకొచ్చింది.
ఇక ఈ పోస్ట్ కి నెటిజెన్ల స్పందిస్తూ.. ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇటీవల కూడా ఒక ఎమోషనల్ పోస్ట్ వేసింది. ‘కలిసి జీవించడానికి చివరి వరకు పోరాడుతూనే ఉన్నాము. మన జీవితం ఎప్పుడు పరిచిన పూలబాటలా లేదు. కారులో పడుకోవడం నుండి ఇక్కడ వరకు చాలా దూరం ప్రయాణించం. మమల్ని నువ్వు ప్రేమించినంతగా ఎవరు ప్రేమించలేరు’ అంటూ పోస్ట్ చేసింది. అంతకుముందు తారకరత్న చనిపోయిన 3 రోజుల్లో ఆయన బర్త్ డే రావడంతో.. మీరు బెస్ట్ ఫాదర్, బెస్ట్ హస్బెండ్ అంటూ పోస్ట్ చేసింది.