Ted Sarandos Meet All Tollywood Stars one by one Photos Goes Viral
Ted Sarandos : నెట్ ఫ్లిక్స్(Netflix) CEO టెడ్ సరండోస్(Ted Sarandos) ఇండియాకు రాగా టాలీవుడ్ లో వరుసగా స్టార్స్ అందర్నీ కలుస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. మొన్న మెగాస్టార్ ఫ్యామిలీని కలిసి, చిరంజీవి ఇంట్లో లంచ్ చేసి చిరంజీవి, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, నిర్మాతలు శోభు యార్లగడ్డ, విక్కీలతో కలిసి మాట్లాడారు టెడ్ సరండోస్. నిన్న నందమూరి ఫ్యామిలీని కలిసి ఎన్టీఆర్ ఇంట్లో లంచ్ చేసి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, కొరటాల శివతో ముచ్చటించారు.
మొదట మెగా, నందమూరి ఫ్యామిలీలను టెడ్ సరండోస్ కలవడంతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నెట్ ఫ్లిక్స్ లో భవిష్యత్తులో గ్రాండ్ గా ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమో, ఎన్టీఆర్, చరణ్ లతో ఏదైనా కొత్తగా ప్లాన్ చేస్తున్నారేమో అని వార్తలు వస్తున్నాయి. కానీ టెడ్ సరండోస్ వరుసగా టాలీవుడ్ స్టార్స్ అందర్నీ కలుస్తున్నారు. ఇవాళ ఉదయం గుంటూరు కారం సెట్లో మహేష్ బాబు, త్రివిక్రమ్ ని కలిశారు. మహేష్ వారితో కలిసి దిగిన ఫోటోనో సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అంతకుముందే టెడ్ సరండోస్ నిన్న రాత్రే అనేకమంది టాలీవుడ్ స్టార్స్ ని కలిశారు. అల్లు అర్జున్, సుకుమార్ తో నిన్న రాత్రి స్పెషల్ డిన్నర్ చేశారు. అల్లు అర్జున్, సుకుమార్ తో పాటు మైత్రి నిర్మాతలు కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. అనంతరం రామానాయుడు స్టూడియోలో స్పెషల్ పార్టీ ఏర్పాటు చేయగా వెంకటేష్, నాగ చైతన్య, రాజమౌళి, సురేష్ బాబు, రానా, దుల్కర్ సల్మాన్, నిర్మాత శోభు యార్లగడ్డ.. పలువురు మరికొంతమంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. నెట్ ఫ్లిక్స్ CEO టెడ్ సరండోస్ ఇండియాకు రావడం, టాలీవుడ్ కి వచ్చి వరుసగా స్టార్ సెలబ్రిటీలందర్నీ కలవడం ఇప్పుడు చర్చగా మారింది. నెట్ ఫ్లిక్స్ లో భవిష్యత్తులో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయనున్నారో, వాటిల్లో మన స్టార్స్ ఎలా భాగం అవ్వనున్నారో అని ప్రేక్షకులు, అభిమానులు చర్చించుకుంటున్నారు. టెడ్ సరండోస్ ఇంకెంతమంది టాలీవుడ్ స్టార్స్ ని కలుస్తారో చూడాలి.
Netflix CEO Mr Ted Sarandos along with his team met the Maverick Director @ssrajamouli, Victory @VenkyMama, @RanaDaggubati, Yuvasamrat @chay_akkineni, @dulQuer along with Producers @SBDaggubati, @Shobu_ & #DevineniPrasad and had an insightful discussion!!@NetflixIndia pic.twitter.com/TO5wCq5rvo
— ??????????? (@UrsVamsiShekar) December 9, 2023
#Netflix CEO #TedSarandos and Icon star @alluarjun engaged in captivating conversations about Indian Cinema during a delightful dinner at the star's residence in Hyderabad! #AlluArjun #Pushpa pic.twitter.com/6AOPi8Ifge
— ??????????? (@UrsVamsiShekar) December 9, 2023