Teja Sajja : ‘హనుమాన్’ సినిమాతో స్టార్ హీరోల సరసన తేజ సజ్జా.. కేవలం 8 మంది మాత్రమే సాధించిన రికార్డ్..

హనుమాన్ సినిమా ఇప్పటికే 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అన్ని ఏరియాలలో కలెక్షన్స్ తో సరికొత్త రికార్డ్ సెట్ చేసింది.

Teja Sajja : ప్రశాంత్ వర్మ(Prasanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా ఇటీవల సంక్రాతికి వచ్చిన హనుమాన్(Hanuman) సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. పల్లెటూళ్ళో ఓ వ్యక్తికి హనుమంతుడి పవర్స్ వస్తే అనే సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కిన హనుమాన్ సినిమా పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించి పెద్ద హిట్ అయింది.

హనుమాన్ సినిమా ఇప్పటికే 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అన్ని ఏరియాలలో కలెక్షన్స్ తో సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. అమెరికాలో కూడా టాప్ 5 తెలుగు సినిమాగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక 30 రోజుల్లో 300 సెంటర్స్ లో హనుమాన్ సినిమా ఆడుతూ చాలా రోజుల తర్వాత సినీ పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొచ్చింది. తాజాగా హనుమాన్ సినిమా మరో సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. హనుమాన్ సినిమా నార్త్ లో 50 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది.

Also Read : Dunki : సడెన్‌గా ఓటీటీలోకి వచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చిన షారుఖ్ ఖాన్ ‘డంకీ’.. ఏ ఓటీటీలో?

సౌత్ నుంచి నార్త్ ఇండియాలో రిలీజయి 50 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసిన అతి తక్కువ సినిమాల సరసన హనుమాన్ నిలిచింది. ఇప్పటివరకు బాహుబలి 1, బాహుబలి 2, పుష్ప, RRR, రోబో 2, కాంతార, KGF 2 సినిమాలు మాత్రమే ఈ రికార్డుని సాధించాయి. దీంతో ఆ స్టార్ హీరోల సరసన తేజ సజ్జ కూడా చేరాడు ఇప్పుడు. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రజినీకాంత్, యశ్, రిషబ్ శెట్టి తర్వాత తేజ సజ్జ నార్త్ లో 50 కోట్లు నెట్ కలెక్ట్ చేసిన హీరోగా రికార్డ్ సెట్ చేసాడు. హనుమాన్ ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా లేదు. 50 రోజులు థియేటర్స్ లో కచ్చితంగా ఆడుతుంది. ఇక హనుమాన్ సినిమా మార్చ్ లో జీ5 ఓటీటీలోకి రానుంది.

ట్రెండింగ్ వార్తలు