Hanuman : ‘హనుమాన్’ 50 రోజులు.. ఎన్ని సెంటర్స్‌లో తెలుసా? చాలా ఏళ్ళ తర్వాత టాలీవుడ్‌లో సరికొత్త రికార్డ్..

ఇప్పుడు హనుమాన్ సినిమా థియేటర్స్ విషయంలో మరో సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. హనుమాన్ సినిమా నేటికి 50 రోజులు పూర్తిచేసుకుంది.

Teja Sajja Prasanth Varma Hanuman Movie Creates New Record in 50 Days

Hanuman : తేజ సజ్జ(Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ(Prashanth Varma) దర్శకత్వంలో ఓ సూపర్ హీరో సినిమాగా సంక్రాంతికి వచ్చిన ‘హనుమాన్’ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలతో పోటీపడి భారీ హిట్ కొట్టింది. హనుమాన్ సినిమా ఇప్పటికే అనేక రికార్డులు సెట్ చేసింది. కలెక్షన్స్ పరంగా చిన్న సినిమాగా రిలీజయి ఏకంగా 350 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అన్ని ఏరియాలలో అదరగొట్టేసింది.

ఇక ఈ సినిమా థియేటర్స్ విషయంలో కూడా రికార్డులు సెట్ చేసింది. సినిమా రిలీజ్ సమయంలో అందరూ పెద్ద హీరోలు ఉండటంతో థియేటర్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. కానీ అలాంటి పరిస్థితి నుంచి ఎక్కువ థియేటర్స్ లో ఎక్కువ రోజులు ఆడి రికార్డ్స్ సెట్ చేసింది హనుమాన్. కొన్ని రోజుల క్రితం 300 సెంటర్స్ లో 30 రోజులు ఆడి అందర్నీ ఆశ్చర్యపరిచింది. గతంలో 50 డేస్, 100 డేస్ ఇన్ని థియేటర్స్ లో ఆడుతుందని గొప్పగా చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా రెండు వారాలకు మించి థియేటర్స్ లో ఉండట్లేదు. కానీ ఇన్నేళ్ల తర్వాత ఒక చిన్న సినిమా ఆ రేంజ్ విజయం సాధించింది.

Also Read : Hanuman : శివరాత్రి రోజు హనుమంతుడి ఆగమనం.. ‘హనుమాన్’ ఓటీటీ స్ట్రీమింగ్ డీటెయిల్స్..

ఇప్పుడు హనుమాన్ సినిమా థియేటర్స్ విషయంలో మరో సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. హనుమాన్ సినిమా నేటికి 50 రోజులు పూర్తిచేసుకుంది. ఇటీవల 50 డేస్ ఒక సినిమా థియేటర్స్ లో ఆడటం అంటే స్టార్ హీరోలకు కూడా కష్టమే కానీ హనుమాన్ సినిమా ఏకంగా 150 సెంటర్స్ లో 50 రోజులు ఆడి తెలుగు పరిశ్రమలో మరో సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. దీంతో హనుమాన్ యూనిట్ ని మరోసారి అంతా అభినందిస్తున్నారు.

ఇక హనుమాన్ సినిమా శివరాత్రి కానుకగా మార్చ్ 8 నుండి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనున్నట్టు సమాచారం. థియేటర్స్ లో ఇన్ని రికార్డులు బద్దలుకొట్టిన హనుమాన్ సినిమా ఓటీటీలో ఎన్ని రికార్డ్స్ సెట్ చేస్తుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు