Teja Sajja Risked his life for Hanuman Movie Result gives Happy to him
Teja Sajja : ప్రశాంత్ వర్మ(Prashanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ(Teja Sajja) హీరోగా మన హనుమంతుడిని ఆధారంగా తీసుకొని ఓ సూపర్ హీరో కథగా తెరకెక్కిన సినిమా హనుమాన్(Hanuman). వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని, అమృత అయ్యర్, గెటప్ శీను, వెన్నెల కిషోర్, సత్య, వినయ్ రాయ్.. పలువురు ముఖ్య పాత్రలు చేశారు. ముందు నుంచి ఈ సినిమాపై అంచనాలు ఉండగా నిన్న జనవరి 12న సినిమా రిలీజయి పాజిటివ్ టాక్ రావడంతో భారీ విజయం సాధించింది. కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి హనుమాన్ కి.
హనుమాన్ మంచి విజయం సాధించడంతో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. ఇక హీరో తేజ సజ్జ నేడు మీడియాతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ తో పాటు, సినిమాకు పడ్డ కష్టాలు కూడా చెప్పుకొచ్చాడు.
ఈ సినిమా కోసం దాదాపు రెండున్నరేళ్లు ఏ సినిమా చేయకుండా దీని కోసమే కష్టపడ్డాను అని చెప్పాడు.
సినిమాలో ఓ ఫైట్ లో రోకలిబండతో విలన్ మనుషులని కొట్టి ఆ రోకలి, మనిషిని భుజం మీద వేసుకొని నడిచే సీన్ ఉంటుంది. ఆ సీన్ పర్ఫెక్షన్ కోసం చాలా టేక్స్ తీసుకోగా తేజకు మెడ దగ్గర ఇంజ్యుర్ అయింది. మెడ పట్టేసి నెక్స్ట్ డే షూటింగ్ కి కూడా రాలేకపోయాడు.
అలాగే క్లైమాక్స్ ఆంజనేయస్వామి వచ్చే షాట్ లో తేజ కూడా గాలిలో ఉంటాడు. ఈ సీన్ నాలుగు రోజులు షూట్ చేశారట. నాలుగు రోజులు గ్రీన్ మ్యాట్ ముందు తేజ తాళ్లతో కట్టేసి గాలిలోనే వేలాడుతున్నాడు. రోజుకి కనీసం ఆరుగంటలు తేజ గాల్లోనే ఉన్నాడట చివరి 5 నిమిషాల సీక్వెన్స్ కోసం.
ఒక సీన్ లో తేజ, పలువురు నటులు ఎడ్లబండి మీద వెళ్తుంటే ఎడ్లు మాట వినకుండా అదుపు తప్పి వీరిని పడేశాయి. ఆ సంఘటనలో దెబ్బలు కూడా తగిలాయి.
Also Read : Hanuman : అమెరికాలో ‘హనుమాన్’ హవా.. తేజ సజ్జ మొదటి రికార్డ్..
ఇక హనుమాన్ క్లైమాక్స్ మొత్తం దాదాపు 40 రోజుల పాటు షూట్ చేశారు. ఈ సీన్స్ లో బాగా దుమ్ము, పొగ కూడా ఉంటాయి. అలాగే ఈ సీన్స్ లో తేజ ఫేస్, కళ్ళు రెడ్ గా కనపడటానికి లెన్స్ లు పెట్టుకొని, గ్లిజరిన్ పెట్టుకొని చేశారట. షూటింగ్ అయ్యాక కొన్నాళ్ళకు కుడి కన్ను సరిగ్గా కనిపించకపోవడంతో హాస్పిటల్ కి వెళ్తే కార్నియా దెబ్బ తింది ఆపరేషన్ చేయాలి అన్నారట. ఎక్కువ రోజులు లెన్స్ లు పెట్టుకొని దుమ్ములో షూట్ చేసినందుకు, గ్లిజరిన్ ఎక్కువగా వాడినందుకు కంటికి ఎఫెక్ట్ అయిందని డాక్టర్లు చెప్పారట. అయితే ఆపరేషన్ చేస్తామంటే హనుమాన్ రిలీజ్ అయి అన్ని పనులు అయిపోయాకే చేయించుకుంటాను అని తేజ వెయిట్ చేశాడు. ప్రస్తుతం హనుమాన్ రిలీజయి భారీ విజయం సాధిచడంతో తేజ తాను పడ్డ కష్టానికి మంచి ఫలితం వచ్చిందని సంతోషంగా ఫీల్ అవుతున్నాడు. త్వరలోనే తన కంటికి చికిత్స చేయించుకుంటాడని సమాచారం.