Tejaswini Gowda – Amardeep Chowdary : అమర్ దీప్ తో విడాకులపై క్లారిటీ ఇచ్చిన నటి తేజస్విని గౌడ్..

తాజాగా తేజస్విని గౌడ ఓ ఇంటర్వ్యూలో ఈ విడాకుల రూమర్లపై క్లారిటీ ఇచ్చింది.

Tejaswini Gowda gives Clarity on Divorce Rumors with her Husband Amardeep Chowdary

Tejaswini Gowda – Amardeep Chowdary : సీరియల్ నటి తేజస్విని గౌడ.. నటుడు, బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి పలు టీవీ షోలలో కూడా ఎంటర్టైన్ చేసారు. 2022 లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. అయితే ఇటీవల కొన్ని రోజుల క్రితం వీరు విడాకులు తీసుకుంటారు అని రూమర్లు వచ్చాయి.

తాజాగా తేజస్విని గౌడ ఓ ఇంటర్వ్యూలో ఈ విడాకుల రూమర్లపై క్లారిటీ ఇచ్చింది.

Also Read : Siree Lella : హ్యాపీ బర్త్ డే పెద మామయ్య.. చంద్రబాబుకు స్పెషల్ విషెష్ చెప్పిన హీరోయిన్.. ఫోటో వైరల్..

తేజస్విని గౌడ మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా నేను కూడా వింటున్నాను ఆ వార్తలు. సమాధానం చెప్పాలి అనుకున్నాను. కానీ అదే సమయంలో నీతోనే షో వచ్చింది. అందులో నేను, అమర్ కలిసి డ్యాన్స్ చేసి, క్లోజ్ గా ఉన్నాం. దానికంటే సమాధానం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అనిపించింది. రీసెంట్ గా ఇస్మార్ట్ జోడి షోలో కూడా క్లారిటీ ఇచ్చాను. జనాలకు బయట కూడా మనం అన్యోన్యంగా, ప్రేమగా కనపడాలి. లేకపోతే మన మధ్య బాగోలేదు అని అనుకుంటారు. అందరికి సమాధానం ఇచ్చుకుంటూ పోతే మనకు టైం సరిపోదు. ఇలాంటి న్యూస్ లు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన గురించి మంచిగా అనుకుంటున్నవాళ్లకు కూడా డౌట్ తెప్పిస్తారు. వాళ్ళు ఇలాంటి వార్తలు ఎందుకు ప్రచారం చేస్తున్నారో తెలీదు. విని వదిలేస్తున్నాం. మీ ఇష్టమొచ్చినట్టు చేసుకోండి అని వదిలేశాం అంటూ తెలిపింది.