CM Revanth Reddy and Chiranjeevi
CM Revanth Reddy : మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ తో సత్కరించిన విషయం తెలిసిందే. ఈ పురస్కారం మెగాస్టార్ కు రావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు.. ముఖ్యంగా ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. చిరంజీవికి రాజకీయ, సినీ, పలు రంగాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్ పురస్కారానికి మెగాస్టార్ చిరంజీవి ఎంపికైన సందర్భంగా కోడలు ఉపాసన కొణిదెల హైదరాబాద్ లో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్ తో పాటు పలు రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.
Also Read : Chiranjeevi : రాజకీయాలు.. రాజకీయ నాయకుల గౌరవాన్ని పెంచారు.. అద్వానీ భారతరత్నకు అర్హులు.. చిరంజీవి ట్వీట్
సీఎం రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. చిరు కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలుకరించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం మనందరికీ గర్వకారణం అన్నారు. వారికి నా హృధయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. నన్ను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు.
చిరు కుటుంబం ఏర్పాటు చేసిన విందులో సీఎం రేవంత్, పలువురు ప్రముఖులు పాల్గొన్న సందర్భంగా ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రేవంత్ రెడ్డి మెగాపవర్ స్టార్ రాంచణ్ తో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ కనిపించారు. ఇదిలాఉంటే.. పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత చిరంజీవిని ఘనంగా సత్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ (ఆదివారం) ఉదయం 10గంటలకు శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొని చిరంజీవితో పాటు పద్మ అవార్డుల గ్రహీతలను సన్మానించనున్నారు.
పద్మ విభూషణ్ పురస్కారం పొందిన ప్రముఖ సినీ నటులు శ్రీ చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి.
అవార్డు ప్రకటన సందర్బంగా విందు ఏర్పాటు చేసిన శ్రీ చిరంజీవి.
విందుకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన సీఎం.
శ్రీ చిరంజీవి గారికి అవార్డు రావడం మనందరికీ… pic.twitter.com/JhTzVZ6VEn
— Telangana CMO (@TelanganaCMO) February 3, 2024
Chief Minister of Telangana sri @revanth_anumula Garu With Our IDOL ???? ???? ⭐ @KChiruTweets Garu And Our @AlwaysRamCharan at MEGA PARTY ♥️#Chiranjeevi #MegaStarChiranjeevi #PadmaVibhushanChiranjeevi pic.twitter.com/ZYsoZxfOUR
— ???????? ???? ??????? (@Gowtham__JSP) February 4, 2024