Akhanda 2
Akhanda 2 : బాలయ్య బాబు – బోయపాటి కాంబోలో వస్తున్న అఖండ 2 తాండవం సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ముందు రోజే అంటే నేడు డిసెంబర్ 4న ప్రీమియర్ షోలు ప్లాన్ చేసారు. ఇప్పటికే ఆంధ్రలో ప్రీమియర్ షో లకు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చారు. తాజాగా కొద్దిసేపటి క్రితమే తెలంగాణలో కూడా టికెట్ రేట్ల పెంపుకు, ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చారు.(Akhanda 2)
తెలంగాణలో నేడు డిసెంబర్ 4న 600 రూపాయల టికెట్ తో 8 గంటల ప్రీమియర్ షోకి పర్మిషన్ ఇచ్చారు. సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 100 రూపాయలు టికెట్ రేటుపై పెంచుకునేలా అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ స్పెషల్ ప్రైజెస్ కేవలం డిసెంబర్ 5 నుంచి 7 వరకు మాత్రమే. అంటే మూడు రోజులు మాత్రమే ఇచ్చారు. ఏపీలో 10 రోజులు ఉండగా తెలంగాణంలో మూడు రోజులే ఇవ్వడం గమనార్హం. అలాగే ఈ ప్రీమియర్ షోలు, టికెట్ హైక్స్ మీద వచ్చే ఆదాయంలో 20 శాతం మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కు ఇవ్వాలి అని రూల్ కూడా తప్పనిసరి పెట్టారు.
Also Read : Samantha : ‘అతని సమస్య నేనే’.. భర్త పై సమంత ఫస్ట్ పోస్ట్ వైరల్..
ఇటీవల జూబ్లీ హిల్స్ ఎన్నికల సమయంలో టికెట్ హైక్స్, ప్రీమియర్స్ పర్మిషన్ ఇస్తే అందులో వచ్చే దాంట్లో 20 శాతం సినీ కార్మికులకు ఇస్తామని సీఎం రేవంత్ అన్నారు.