Telangana government notices to Diljit Dosanjh star singer responded
Diljit Dosanjh : ప్రముఖ సింగర్, నటుడు దిల్జిత్ దోసాంజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన పాటలకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈయన నిర్వహించే మ్యూజిక్ ఈవెంట్స్ చూడడానికి జనాలు ఎగబడతారు. ఇక ఈ స్టార్ సింగర్ “దిల్-లుమినాటి టూర్” లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ, ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ ఈవెంట్స్ కోసం జనాలు ఎక్కడెక్కడి నుండో వస్తున్నారు.
అయితే హైదరాబాద్ లో జరిగే ఈ ఈవెంట్ నిర్వాహకులకు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులో మద్యం, మాదక ద్రవ్యాలు లేదా హింసను ప్రోత్సహించే ఎలాంటి పాటలను ప్రదర్శించకూడదని దోసాంజ్ కు ఈ నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. ఇలా ఆయనకి నోటీసులు పంపడానికి కారణం ఓ చండీఘడ్ వాసి. ఇటీవల న్యూ ఢిల్లీలో కూడా ఈ ఈవెంట్ నిర్వహించగా అందులో డ్రగ్స్, ఆల్కహాల్ ప్రోమోట్ చేస్తునట్టు కొన్ని ఆధారాలతో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో తెలంగాణ పోలీసులు ఇకపై డ్రగ్స్, ఆల్కహాల్ ప్రోమోట్ చెయ్యకూడదని దిల్జిత్ దోసాంజ్ కు ఈ నోటీసులు పంపారు.
Also Read :ఏంటి ‘పుష్ప3’లో నటిస్తావా..! తిలక్ వర్మను ఆటపట్టించిన సూర్యకుమార్ యాదవ్.. ఫన్నీ వీడియో వైరల్
అయితే తాజాగా ఈ విషయంపై స్పందించారు దిల్జిత్ దోసాంజ్.. “తుఫాను ఆగిపోతే మనం తుఫాను అవుతాము, తుఫాను ఆగిపోతే మనం అగ్ని నది అవుతాము” అని పోస్ట్ చేశాడు. తెలంగాణ ప్రభుత్వం తనకి పంపిన నోటీసులను దృష్టిలో పెట్టుకునే ఆయన ఈ పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే దీనికి సంబందించిన పలు ఫోటోలు కూడాషేర్ చేశారు. దీంతో ఆయన చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.