ఏంటి ‘పుష్ప3’లో నటిస్తావా..! తిలక్ వర్మను ఆటపట్టించిన సూర్యకుమార్ యాదవ్.. ఫన్నీ వీడియో వైరల్
నీ హెయిర్ స్టైల్ చూస్తుంటే అచ్చం అల్లు అర్జున్ లా ఉంది.. అక్కడ తెలుగు సూపర్ స్టార్.. ఇక్కడ నీవు అంటూ సూర్య అనడంతో..

Tilak Varma - Surya Kumar
Tilak Varma – Surya Kumar Yadav: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ను టీమిండియా 3-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ లో హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ బ్యాటింగ్ లో అదరగొట్టాడు. ఈ సిరీస్ లో తిలక్ రెండు సెంచరీలు చేశాడు. సిక్సులు, ఫోర్లతో దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తిలక్ వర్మ దూకుడైన బ్యాటింగ్ తో సరికొత్త రికార్డులనుసైతం నమోదు చేశాడు. సిరీస్ విజయం తరువాత తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. తిలక్ వర్మ జుట్టు పెంచుతుండటంతో దానిపై సూర్య ఫన్నీ కామెంట్స్ చేశాడు. ఏంటి ఫుష్ప -3లో నటించాలని అనుకుంటున్నావా..? అందరూ నిన్ను అల్లు అర్జున్ అని పిలుస్తున్నారు ఏంటి.. అంటూ ప్రశ్నించాడు.
నీ హెయిర్ స్టైల్ చూస్తుంటే అచ్చం అల్లు అర్జున్ లా ఉంది.. అక్కడ తెలుగు సూపర్ స్టార్.. ఇక్కడ నీవు అంటూ సూర్య అనడంతో.. అదేంలేదు.. ఈ హెయిర్ స్టైల్ ని ఇప్పుడే మొదలు పెట్టా.. దీంతో అందరూ అల్లు అర్జున్ అని పిలుస్తున్నారు. చాలా మంది అల్లు అర్జున్ హెయిల్ స్టైల్ లా ఉంది.. అలానే కనిపిస్తున్నావ్ అంటున్నారు. ఇలా హెయిర్ పెంచుకోవటం నాకు ఇష్టం. పొడగాటి హెయిర్ పై హెల్మెంట్ పెట్టుకుంటే మస్త్ అనిపిస్తుంది అందుకే హెయిర్ పెంచుతున్నా అంటూ తిలక్ వర్మ సమాధానం ఇచ్చాడు. దీంతో సూర్య స్పందిస్తూ.. ఏంటి పుష్ప -3 సినిమాలో నటించాలనుకుంటున్నావా.. అని అనడంతో.. అబ్బే అదేంలేదు. ప్రస్తుతం నాపని బాల్, బ్యాట్ తో మైదానంలో రాణించడమే.. అంటూ తిలక్ వర్మ సమాధానం ఇచ్చారు.
తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ మధ్య ఫన్నీ సంభాషణకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ కృషి అవుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘పుష్ప’ ఫీవర్ నడుస్తోంది. ఈ క్రమంలో స్టార్ క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మల మధ్య పుష్ప సినిమాకు సంబంధించిన సంభాషణ జరగడంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Nicee @alluarjun @TilakV9 🧡 pic.twitter.com/q708J77eiY
— Yash 🪓🐉 (@YashR066) November 16, 2024