IND vs AUS : టీమిండియాకు బిగ్‌షాక్‌.. ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు శుభ్‌మ‌న్ గిల్‌, కేఎల్ రాహుల్ దూరం.. ఎందుకంటే?

ప్రతిష్టాక టోర్నీ ముంగిట టీమిండియాను గాయాల బాధ వెంటాడుతోంది. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా మోచేతికి దెబ్బ తగలడంతో సీనియర్ బ్యాటర్

IND vs AUS : టీమిండియాకు బిగ్‌షాక్‌.. ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు శుభ్‌మ‌న్ గిల్‌, కేఎల్ రాహుల్ దూరం.. ఎందుకంటే?

Shubman gill and KL Rahul

Updated On : November 17, 2024 / 7:21 AM IST

Border-Gavaskar Trophy 2024: బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కానుంది. తొలి టెస్టు ఈనెల 22న పెర్త్ లో జరగనుంది. ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియాకు చేరుకొని ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ టెస్టు సిరీస్ భారత్ జట్టుకు ఎంతో కీలకమైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకోవాలంటే టీమిండియా ఐదు టెస్టుల్లో నాలుగు టెస్టులు గెలవాల్సి ఉంది. దీంతో ఆస్ట్రేలియా సిరీస్ ను భారత్ జట్టు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే, మొదటి టెస్ట్ కు ముందే భారత్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. మొదటి టెస్టుకు శుభ్‌మ‌న్ గిల్‌ దూరమైనట్లు తెలుస్తోంది.

Also Read: Kohli – Tilak Varma : అరెరె.. కోహ్లీ రికార్డు తుడిచిపెట్టుకుపోయిందే.. తిల‌క్ వ‌ర్మ‌తో మామూలుగా ఉండ‌దుగా..

ప్రతిష్టాక టోర్నీ ముంగిట టీమిండియాను గాయాల బాధ వెంటాడుతోంది. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా మోచేతికి దెబ్బ తగలడంతో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా శుభ్‌మ‌న్ గిల్‌ కు కూడా గాయమైంది. శనివారం జట్టులోని ఆటగాళ్లతో అంతర్గత మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా గిల్ వేలికి గాయమైంది. అతని వేలుకు బంతి బలంగా తాకడంతో .. వెంటనే మ్యాచక్ నుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత స్కానింగ్ తీయగా అతడి వేలికి చీలిక వచ్చినట్లు తేలింది. తొలి టెస్టు ఈనెట 22న ప్రారంభం కానుంది. మరో ఐదు రోజులు సమయం ఉండగా.. ఆలోపు గిల్ కోలుకునే అవకాశాలు తక్కువని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

Also Read: SA vs IND : అనుకోకుండా టీమ్ఇండియా క్యాప్‌ను తొక్కిన సూర్య‌కుమార్ యాద‌వ్.. ఆ త‌రువాత ఏం చేశాడో తెలుసా?

ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి టెస్టుకు దూరమయ్యాడు. తన భార్య రితిక శుక్రవారం రాత్రి రెండోబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఇక రోహిత్ ఆస్ట్రేలియా టూర్ కు వెళ్తాడని, మొదటి టెస్టు కు అందుబాటులో ఉంటాడని అందరూ భావించారు. కానీ, కొన్నిరోజుల పాటు కుటుంబంతో గడపాలని రోహిత్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రోహిత్ తొలిటెస్టుకు అందుబాటులో ఉండడని బీసీసీఐ వర్గాల సమాచారం. మరోవైపు కేఎల్ రాహుల్ కు కూడా గాయమైంది. మోచేతికి దెబ్బ తాకడంతో శుక్రవారం రాహుల్ మైదానాన్ని వీడాడు. అయితే, తొలి టెస్టు ప్రారంభానికి మరో ఐదు రోజులు సమయం ఉండటంతో కేఎల్ రాహుల్ మ్యాచ్ సమయానికి జట్టుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. గిల్ మాత్రం తొలి టెస్టు సమయానికి అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువ అని, ఆయన గాయం మానాలంటే కనీసం వారం రోజులకుపైగా సమయం పడుతుందని తెలుస్తోంది. గిల్ తొలి టెస్టు మ్యాచ్ కు దూరమైతే.. అతని స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

టెస్ట్ సిరీస్ ఇలా..
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో మొత్తం ఐదు మ్యాచ్ లు ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరగనున్నాయి.
తొలి టెస్టు ఈనెల 22 నుంచి 26వ తేదీ వరకు పెర్త్ మైదానంలో జరగనుంది.
రెండో టెస్టు డిసెంబర్ 6 నుంచి 10వ తేదీ వరకు ఆడిలైడ్ లో జరగనుంది.
మూడో టెస్టు డిసెంబర్ 14 నుంచి 18వ తేదీ వరకు బ్రిస్బేన్ లో జరగనుంది.
నాలుగో టెస్టు డిసెంబర్ 26 నుంచి 30వ తేదీ వరకు మెల్బోర్న్ లో జరగనుంది.
ఐదో టెస్టు జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు సిడ్నీలో జరగనుంది.