Kohli – Tilak Varma : అరెరె.. కోహ్లీ రికార్డు తుడిచిపెట్టుకుపోయిందే.. తిలక్ వర్మతో మామూలుగా ఉండదుగా..
దక్షిణాఫ్రికా గడ్డపై వరుసగా రెండు టీ20 మ్యాచుల్లోనూ రెండు శతకాలతో చెలరేగాడు తెలుగు తేజం తిలక్ శర్మ.

Kohli Record Broken Tilak Varma Scripts History
Kohli – Tilak Varma : దక్షిణాఫ్రికా గడ్డపై వరుసగా రెండు టీ20 మ్యాచుల్లోనూ రెండు శతకాలతో చెలరేగాడు తెలుగు తేజం తిలక్ శర్మ. ప్రస్తుతం అతడి పేరు క్రికెట్ వర్గాల్లో మారుమోగిపోతుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు టీ20 మ్యాచుల్లో 140 సగటు, 198 స్ట్రైక్‌రేటుతో తిలక్ 280 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఇంతక ముందు ఈ రికార్డు టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. 2020-21లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో కోహ్లీ 231 పరుగులు చేశాడు. ఐదు మ్యాచులు ఆడిన కోహ్లీ 115 సగటు, 147 స్ట్రైక్‌రేటుతో ఈ పరుగులు సాధించాడు. ఇక వీరిద్దరి తరువాత కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్‌లు ఉన్నారు.
ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు..
తిలక్ వర్మ – 280 పరుగులు (దక్షిణాఫ్రికా పై)
విరాట్ కోహ్లీ – 231 పరుగులు (ఇంగ్లాండ్ పై)
కేఎల్ రాహుల్ – 224 పరుగులు (న్యూజిలాండ్ పై)
రుతురాజ్ గైక్వాడ్ – 223 పరుగులు (ఆస్ట్రేలియాపై)
సంజూ శాంసన్ – 216 పరుగులు (దక్షిణాఫ్రికాపై)
రెండో టీమ్ఇండియ ప్లేయర్..
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వరుసగా రెండు సెంచరీలు సాధించిన రెండో భారత ఆటగాడిగా తిలక్ వర్మ రికార్డులకు ఎక్కాడు. అతడి కన్నా ముందు ఈ జాబితాలో సంజూ శాంసన్ ఉన్నాడు. ఇక ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన ఐదో ఆటగాడిగా తిలక్ వర్మ నిలిచాడు. గుస్తావ్ మెకియాన్, రిలే రూసో, ఫిలిప్ సాల్ట్, సంజూ శాంసన్, తిలక్ వర్మలు ఈ ఘనత సాధించారు.
IPL Auction 2025 : ఐపీఎల్ మెగా వేలం షార్ట్ లిస్ట్ రిలీజ్.. మెగా వేలంలో 13 ఏళ్ల కుర్రాడు..